Hukumpeta: వైఎస్సార్సీపీ సర్పంచ్ అభ్యర్థి అనిల్కు వెల్లువెత్తుతున్న మద్దతు!
Hukumpeta: అల్లూరి జిల్లా హుకుంపేట పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి అనిల్ గ్రామాభివృద్ధే ధ్యేయమని పేర్కొంటూ ఓటర్లను మద్దతు కోరారు.
Hukumpeta: వైఎస్సార్సీపీ సర్పంచ్ అభ్యర్థి అనిల్కు వెల్లువెత్తుతున్న మద్దతు!
Hukumpeta: పుట్టి పెరిగిన ఊరు రుణం తీర్చుకోవాలనే తపనతో, గ్రామ ప్రజలకు మెరుగైన సేవ చేయాలనే సంకల్పంతో పంచాయతీ ఎన్నికల బరిలో నిలిచానని వైఎస్సార్సీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి అనిల్ స్పష్టం చేశారు. గ్రామాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దడమే తన ధ్యేయమని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా అభ్యర్థి అనిల్ మాట్లాడుతూ... "నేను పుట్టి పెరిగిన హుకుంపేట గ్రామానికి సేవ చేసే అదృష్టం నాకు కల్పించాలని గ్రామ పెద్దలు, తల్లులు, యువకులు, అన్నాదమ్ముళ్లందరినీ కోరుతున్నాను. మీ అందరి ఆశీస్సులు, దీవెనలు నాకు ఉంటే గ్రామ అభివృద్ధికి పూర్తి స్థాయిలో శ్రమిస్తాను" అని తెలిపారు.
హుకుంపేట గ్రామ పంచాయతీలో మౌలిక వసతుల కల్పన, తాగునీరు, సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థతో పాటు ప్రతి ఒక్క సంక్షేమ పథకం అర్హులైన పేదలకు నేరుగా అందేలా చూస్తానని ఆయన హామీ ఇచ్చారు. పంచాయతీని సమగ్రాభివృద్ధి పథంలో నడిపించడానికి తన వంతు కృషి చేస్తానని పునరుద్ఘాటించారు.
"రాబోయే పంచాయతీ ఎన్నికల్లో ప్రజలందరూ ఏకమై, వైఎస్సార్సీపీ అభివృద్ధి అజెండాను బలపరచాలి. మీ విలువైన ఓటును వేసి, నన్ను భారీ మెజారిటీతో గెలిపించండి. గ్రామ సర్వతోముఖాభివృద్ధికి మీ వంతు సహకారం అందించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను" అని పాంగి బొంజుబాబు(అనిల్ )విజ్ఞప్తి చేస్తున్నారు.
యువకుడు వైయస్సార్ పార్టీ మండల అధ్యక్షునిగా రాజకీయాల ప్రజాసేవ పట్ల పూర్తి అవగాహన కలిగిన యువ నాయకుడిగా పేరు సంపాదించుకున్న అనిల్ గ్రామ సర్పంచ్ గా గెలుపొందితే గ్రామం ఎంతో అభివృద్ధి చెందుతుందని పలువురు అభిప్రాయపడుతూ గ్రామ పెద్దలు యువకులు వ్యాపారులు కార్మికులు అనేకమంది యువ నాయకుడు అనిల్ కు మద్దతు తెలపడం విశేషం




