Anakapalle: అనకాపల్లిలో వైఎస్సార్‌సీపీకి షాక్ జనసేనలో చేరిన కాండ్రేగుల దేవా!

Anakapalle: అనకాపల్లి 109వ వార్డు వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా ఇన్‌చార్జ్ కాండ్రేగుల దేవా జనసేన పార్టీలో చేరారు. భీమరశెట్టి రాంకీ సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI
Published on: 18 Oct 2026 9:47 AM IST
Anakapalle
X

Anakapalle: అనకాపల్లిలో వైఎస్సార్‌సీపీకి షాక్ జనసేనలో చేరిన కాండ్రేగుల దేవా!

Anakapalle: అనకాపల్లి రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. 109వ వార్డుకు చెందిన వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా ఇన్‌చార్జ్ కాండ్రేగుల దేవా జనసేన పార్టీలో చేరారు. జనసేన అనకాపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జ్ భీమరశెట్టి రాంకీ సమక్షంలో దేవాతో పాటు ఆయన మిత్రబృందం జనసేన కండువా కప్పుకున్నారు.

కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తోందని, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ నాయకత్వంలో అనకాపల్లి మరింత అభివృద్ధి చెందుతుందనే నమ్మకంతోనే జనసేనలో చేరినట్లు కాండ్రేగుల దేవా తెలిపారు. జనసేన పార్టీ సిద్ధాంతాలు తనను ఆకర్షించాయని ఆయన పేర్కొన్నారు.

109వ వార్డులో వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా విభాగంలో పనిచేసిన దేవా జనసేనలో చేరడంతో స్థానిక రాజకీయ వర్గాల్లో ఈ పరిణామం చర్చనీయాంశంగా మారింది.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI

NAGA SRINIVASARAO, ANAKAPALLI