Parvathipuram: అప్పులు తెచ్చి సాగు చేస్తే.. గాలివాన బీభత్సానికి పెట్టుబడి బూడిదపాలు!

Parvathipuram: పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మవలస మండలంలో గాలివాన బీభత్సం సృష్టించింది.

V.SESHU	, KURUPAM
Published on: 3 May 2026 1:27 PM IST
Parvathipuram
X

Parvathipuram: అప్పులు తెచ్చి సాగు చేస్తే.. గాలివాన బీభత్సానికి పెట్టుబడి బూడిదపాలు!

పార్వతీపురం మన్యం జిల్లా: జియ్యమ్మవలస మండలంలో గాలివాన బీభత్సం సృష్టించింది.గత రెండు రోజులు గా వీచిన ఈదురుగాలుల ధాటికి అరటి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మొక్కజొన్న నేలమట్టమైంది. 60-80 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులకు వరి, అరటి, మొక్కజొన్న పంట నేలకొరిగింది.జియమ్మవలస మండలం లోని కుదమ, గౌరీపురం, పరజపాడు, సింగనాపురం తదితర గ్రామాల్లో సుమారు 300 ఎకరాల్లో చేతికందిన అరటి పంట నేలమట్టమైంది. లక్షల రూపాయలు పెట్టుబడి నేలపాలైందంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అప్పులు చేసి మరి పెట్టుబడులు పెట్టి వ్యవసాయం చేస్తున్నామని, పంట చేతికి వచ్చిన సమయంలో ఈ గాలి,వానలు బీభత్సం సృష్టించాయని, ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

V.SESHU	, KURUPAM

V.SESHU , KURUPAM

Next Story