Kurupam: కురుపాం గురుకుల పాఠశాలలో 50 మంది విద్యార్థులకు అస్వస్థత!

Kurupam: పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం గురుకుల పాఠశాలలో 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 6 Nov 2026 11:10 AM IST
Kurupam
X

Kurupam: కురుపాం గురుకుల పాఠశాలలో 50 మంది విద్యార్థులకు అస్వస్థత!

Kurupam: పార్వతీపురం మన్యం జిల్లాలోని కురుపాం గురుకుల పాఠశాలలో విద్యార్థులు అస్వస్థతకు గురికావడం కలకలం రేపుతోంది. సుమారు 50 మంది విద్యార్థులు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.

వీరిలో ముగ్గురు విద్యార్థులకు కురుపాం సామాజిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స అందిస్తుండగా, మరికొంతమందికి మాదలింగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలు అందిస్తున్నారు. అయితే విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై పాఠశాల సిబ్బంది వివరాలు వెల్లడించకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అసలు విద్యార్థులు అస్వస్థతకు గురికావడానికి కారణాలేంటి అన్న విషయాలపై స్పష్టత ఇవ్వాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్