Bobbili: ఉత్తరాంధ్రను కరువు ప్రాంతంగా ప్రకటించాలని డిమాండ్

Bobbili: బొబ్బిలి తాసిల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలిపిన రైతు సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వేమిరెడ్డి లక్ష్మినాయుడు.

P SRINIVASARAO,	BOBBILI
Published on: 24 Aug 2026 6:01 PM IST
Bobbili
X

Bobbili: ఉత్తరాంధ్రను కరువు ప్రాంతంగా ప్రకటించాలని డిమాండ్

బొబ్బిలి: ఉత్తరాంధ్ర జిల్లాలను కరువు ప్రాంతాలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని రైతు సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు వేమిరెడ్డి లక్ష్మిo నాయుడు డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక తాసిల్దార్ కార్యాలయం బయట నిరసన కార్యక్రమం చేపట్టి అనంతరం ఆర్ఐ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాలు సకాలంలో పూర్తిస్థాయిలో పడకపోవడం వలన ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో వరి ఉడుపులు నామమాత్రంగానే జరిగాయని. ఇటువంటి దారుణ పరిస్థితి గడ్డు పరిస్థితి ఎనాడు చూడలేదని. ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి సాగునీటి ప్రాజెక్టుల్లో కూడా కనీస నీటిమట్టం వరకు నీరు లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని.

కావున ఈ ప్రభుత్వం రైతులకు రైతు కూలీలకు ఆదుకోవాలని. సకాలంలో యూరియా అందించాలని. ఉపాధి హామీ పథకంలో వేతన దారులకు 200 రోజులు పని కల్పించి ఒక్కో వేతనం ధరణి 500 రూపాయలు వేతనం ఇవ్వాలని.

ఏదైతే రైతులు బ్యాంకుల్లో పంట రుణాలు తీసుకున్నారు వాటిని వెంటనే మాఫీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు కోట అప్పన్న. మునకాల శ్రీనివాస్. రైతులు తమ్మిరెడ్డి కృష్ణులు. వజ్జి రవికుమార్. రామారావు చిన్న నాయుడు తదితరులు పాల్గొన్నారు.

P SRINIVASARAO,	BOBBILI

P SRINIVASARAO, BOBBILI

Next Story