Parvathipuram: పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ జయంతి వేడుకలు ఘనవిజయం!

Parvathipuram: పార్వతీపురం మన్యం జిల్లా పోలీసు కార్యాలయంలో పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)
Published on: 7 Aug 2026 6:03 PM IST
Parvathipuram
X

Parvathipuram: పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ జయంతి వేడుకలు ఘనవిజయం!

పార్వతీపురం మన్యం జిల్లా...

పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ జయంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకుంటూ, చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన అదనపు ఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు

పార్వతీపురం:అగ్నికులక్షత్రియ జాతి పితగా కొలువబడుతూ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన మహోన్నత వ్యక్తి పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ జయంతి సందర్భంగా, ఆగష్టు 07న జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో, జిల్లా పోలీసు కార్యాలయంలో, జిల్లా ఎస్పీ శ్రీ ఎస్.వి.మాధవ్ రెడ్డి, ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ ఎం. వెంకటేశ్వరరావు గారు మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి, పుష్ఫాలు సమర్పించి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన విశిష్ట సేవలను స్మరించుకుంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు 07న ఆయన జయంతిని అధికారికంగా రాష్ట్ర పండుగగా నిర్వహిస్తోందన్నారు.ఆయుర్వేద వైద్యం ద్వారా అమూల్యమైన సేవలుఅందించారని, అగ్నికుల క్షత్రియులు వెనుకబడిన వర్గాల అభ్యున్నతి, వారి హక్కుల పరిరక్షణ కోసం ఆయనజీవితాంతం కృషి చేశారని కొనియాడారు. అగ్నికుల క్షత్రియ సమాజానికి ప్రత్యేక గుర్తింపు తీసుకురావడంలో, నిరుద్యోగులకు, బడుగు బలహీన వర్గాలకు చేసిన సేవలు చిరస్మరణీయమని అదనపు ఎస్పీ గారు కొనియాడారు.

ఈ కార్యక్రమంలో *ఏఆర్ డిఎస్పీ థామస్ రెడ్డి, ఎస్బీ సిఐ రమణమూర్తి, డిసిఅర్బి సిఐ జి.ఏ.వి.రమణ, ఆర్ఐలు నాయుడు,రాంబాబు, ఆదినారాయణ, ఎస్సైలు, ఆర్ఏస్సైలు, ఏఆర్ఎస్సై లు, AAO బాలరాజు మరియు కార్యాలయంలో విధులు నిర్వహించే వివిధ విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)

Next Story