Parvathipuram: 1/70 చట్టం, జీవో నంబర్ 3 పునరుద్ధరణకు డిమాండ్: ఆదివాసీ జేఏసీ
Parvathipuram: పాచిపెంట మండలంలో ఆగస్టు 8న జరగనున్న మన్యం రాష్ట్ర బంద్‌ను జయప్రదం చేయాలని ఆదివాసీ గిరిజన సంఘం, జేఏసీ నాయకులు ప్రచార ర్యాలీ నిర్వహించారు.
Parvathipuram: 1/70 చట్టం, జీవో నంబర్ 3 పునరుద్ధరణకు డిమాండ్: ఆదివాసీ జేఏసీ
పార్వతీపురం: కార్యక్రమం ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు కొర్ర శ్రీనివాసరావు సోముల బోడియ చెదల రాజు మన్య సమైక్యవేదిక రాష్ట్ర నాయకులు పడాల తమ్మయ్య ఆధ్వర్యంలో జరిగింది సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కోరాడ ఈశ్వరరావు ఈ ర్యాలీ కార్యక్రమంలో పాల్గొని సంపూర్ణ మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా మన్యం బందులో గిరిజలంతా పాల్గొని జయప్రదం చేయాలని 1/70 చట్ట పరిరక్షణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే కౌంటర్ దాఖలు చేయాలని ఉద్యోగ ఉపాధ్యాయ నియామకాల్లో 100% రిజర్వేషన్లు కల్పించే చట్టం చేయాలని నాన్ షెడ్యూల్ గ్రామాల్లో ఉన్న అన్ని గిరిజన గ్రామాలను ఐదవ షెడ్యూల్లో చేర్చాలని అన్నారు జీవో నెంబర్ త్రీ ని పునరుద్ధరణ చేయాలని డిమాండ్ చేశారు.
పిసా చట్టం అమలు చేయాలని 1/70 చట్టం పగడ్బందీగా అమలు చేయాలని ఫారెస్ట్ అధికారులు వేధింపులు లేకుండా గిరిజనుల యొక్క భూములకు రక్షణ కల్పించాలని ఈ రాష్ట్ర బంద్ సందర్భంగా ప్రభుత్వానికి తెలిపారు భవిష్యత్తు పోరాటాలకు ఆదివాసీలంతా ఐక్యంగా ఉద్యమించాలని తెలిపారు అలాగే కంచూరు చాపరాయి వలస వేటగానివలస తోకమెట్ట ఇప్పలవలస మెట్టవలస గ్రామాల్లో ప్రచారం చేయడం జరిగింది రాష్ట్ర మన్యం బంధువులు జయప్రదం కై అందరూ సహకరించాలని కోరారు పాచిపెంట మండలంలో పలు గిరిజన గ్రామాల్లో ప్రచారం చేస్తున్న ఆదివాసీ గిరిజన సంఘం జేఏసీ నాయకులు.




