Parvathipuram: వరి సాగులో తడి-పొడి విధానం హెక్టారుకు 30 డాలర్ల లబ్ధి!

Parvathipuram: వరి సాగులో తడి-పొడి విధానం పాటించడం ద్వారా కార్బన్ క్రెడిట్స్ రూపంలో హెక్టారుకు 30 డాలర్ల వరకు అదనపు లబ్ధి పొందవచ్చని పృథ్వి కార్బన్ సొల్యూషన్స్ సీఈఓ తెలిపారు.

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)
Updated on: 28 July 2026 4:35 PM IST
Parvathipuram
X

Parvathipuram: వరి సాగులో తడి-పొడి విధానం హెక్టారుకు 30 డాలర్ల లబ్ధి!

Parvathipuram: గ్రీన్ హౌస్ వాయువులలో ప్రధానమైన ‘మిథేన్’ గ్యాస్ ఉద్గారాలను వరి సాగు ద్వారా తగ్గించడమే ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశమని పృథ్వి కార్బన్ సొల్యూషన్స్ సీఈఓ ఎం.ఎస్.ఎన్. మూర్తి వెల్లడించారు. మంగళవారం స్థానిక ఎన్జిఓ హోమ్ లో అమెరికన్ సంస్థ అగ్రి క్యాప్చర్ మరియు పృథ్వి కార్బన్ సొల్యూషన్స్ సంయుక్త ఆధ్వర్యంలో రైతులు,స్థానిక భాగస్వాములు, వాటాదారులతో అవగాహన సదస్సు ను ఆయన నిర్వహించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వరి సాగు చేసే 110 నుండి 120 రోజుల పంట కాలంలో కనీసం రెండుసార్లు పొలాన్ని ఎండబెట్టడం (ఏరియేషన్), రెండుసార్లు నీరు పెట్టడం వంటి 'తడి-పొడి' పద్ధతిని అవలంబించాలని తెలిపారు. దీనివల్ల పంట దిగుబడి పెరగడమే కాకుండా మిథేన్ ఉద్గారాలు గణనీయంగా తగ్గుతాయని చెప్పారు.

ఈ విధానానికి అవసరమైన పైపులను కంపెనీయే ఉచితంగా అందిస్తుందని, దీనికోసం రైతుల నుండి ఎలాంటి రుసుము లేదా అదనపు భారం వసూలు చేయరని స్పష్టం చేశారు. రెండు సీజన్లలో వరుసగా వరి పండించే రైతులు ఈ పద్ధతిని పాటిస్తే, కార్బన్ క్రెడిట్స్ ద్వారా ఒక హెక్టారుకు సుమారు 30 అమెరికన్ డాలర్ల వరకు అదనపు ఆదాయం అందుతుందని సీఈఓ వివరించారు.

ఈ ప్రాజెక్ట్ నిర్వహణ కోసం స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించడం జరిగిందని, ప్రాజెక్ట్ ఉద్దేశాలను ప్రజలు, అధికారులకు స్పష్టంగా తెలియజేయడానికి ప్రజాప్రతినిధులు మరియు స్థానిక అధికారులకు సమాచారం అందించి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం డెమో ద్వారా సాగు పద్దతిని రైతులకు అవగాహన కల్పించారు.

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)

Next Story