Vizianagaram: విజయనగరం జిల్లాకు రూ.17,545 కోట్ల వార్షిక రుణ ప్రణాళిక!
Vizianagaram: 2026-27 సంవత్సరానికి రూ.17,545.28 కోట్ల వార్షిక రుణ ప్రణాళికను కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి విడుదల చేశారు. వ్యవసాయం, ఎంఎస్ఎంఈ రంగాలకు పెద్దపీట.
Vizianagaram: విజయనగరం జిల్లాకు రూ.17,545 కోట్ల వార్షిక రుణ ప్రణాళిక!
Vizianagaram: విజయనగరం, ఆగస్టు 18: వ్యవసాయం, MSME, గృహ నిర్మాణం, విద్య తదితర ప్రాధాన్యతా రంగాలకు రుణ ప్రవాహాన్ని పెంచే లక్ష్యంతో రూపొందించిన 2026–27 వార్షిక రుణ ప్రణాళికను జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి విడుదల చేశారు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లీడ్ బ్యాంక్ కార్యాలయం రూపొందించిన ఈ ప్రణాళికలో ₹17,545.28 కోట్ల రుణ లక్ష్యాన్ని నిర్దేశించారు. గత ఏడాది ₹13,444 కోట్లతో పోలిస్తే 30.50 శాతం పెరుగుదల నమోదైంది.
వ్యవసాయం, వ్యవసాయ మౌలిక సదుపాయాలు, అనుబంధ కార్యకలాపాలకు ₹9,673.77 కోట్లు (55.14%), ఇందులో పంట రుణాలకు ₹4,621.06 కోట్లు, వ్యవసాయ మౌలిక సదుపాయాలు, అనుబంధ కార్యకలాపాలకు ₹5,052.71 కోట్లు కేటాయించారు. MSME రంగానికి ₹2,322.44 కోట్లు, గృహ నిర్మాణానికి ₹334.64 కోట్లు, విద్యా రంగానికి ₹63.48 కోట్లు కేటాయించారు.
రైతులకు సంస్థాగత రుణాల లభ్యత పెంచడంతో పాటు MSME రంగంలో పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించి ఉపాధి అవకాశాలు పెంచాలని కలెక్టర్ సూచించారు. అర్హులైన లబ్ధిదారులకు సకాలంలో తగినంత రుణాలు అందేలా బ్యాంకులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో LDM వి.వి. రమణమూర్తి, NABARD AGM టి. నాగార్జున, DRDA ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాస్ పాణి, DCCB CEO సి. ఉమా మహేశ్వరరావు, వ్యవసాయ శాఖ JD వి.టి. రామారావు, వివిధ శాఖల అధికారులు, బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు.




