Parvathipuram: పార్వతీపురం మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి - పోలీసులు

Parvathipuram: పార్వతీపురం వేదాంత కళాశాలలో మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన. గంజాయి ప్రమాదాలు, చట్టాల గురించి విద్యార్థులకు వివరించిన ఎస్పీ మాధవ్ రెడ్డి నేతృత్వంలోని టీమ్.

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)
Published on: 9 July 2026 6:28 PM IST
Parvathipuram
X

Parvathipuram: పార్వతీపురం మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి - పోలీసులు

పార్వతీపురం: పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ (Superintendent of Police) శ్రీ ఎస్.వి. మాధవ్ రెడ్డి, IPS గారి ఆదేశాల మేరకు, CCS ఇన్స్పెక్టర్ కె.వెంకట్రావు మరియు జిల్లా నార్కోటిక్ టాస్క్ ఫోర్స్, CCS సిబ్బంది, అలాగే ఈగిల్ SI భాస్కర రావు గారు కలిసి ఈ రోజు (09.07.2026) పార్వతీపురంలోని వేదాంత జూనియర్ కళాశాలలో 'మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమాన్ని' నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి సుమారు 300 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాల వల్ల కలిగే దుష్ప్రభావాలు, NDPS చట్టం కింద ఉండే చట్టపరమైన పరిణామాలు మరియు శిక్షల గురించి అవగాహన కల్పించారు. గంజాయి లేదా ఇతర మాదకద్రవ్యాలను వాడి తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని, చదువు మరియు కెరీర్‌పై దృష్టి పెట్టాలని వారికి సూచించారు.

అలాగే, తెలియని వ్యక్తుల నుండి బ్యాగులు, పార్శిల్స్ లేదా ఇతర వస్తువులను తీసుకోవద్దని లేదా రవాణా చేయవద్దని (వాటిలో నిషేధిత పదార్థాలు ఉండే అవకాశం ఉన్నందున) వారికి హెచ్చరించదమైనది. మాదకద్రవ్య రహిత సమాజ నిర్మాణంలో పోలీసులకు సహకరించాలని విద్యార్థులను ప్రోత్సహించాము.

మాదకద్రవ్యాల వినియోగం, అమ్మకం లేదా రవాణాకు సంబంధించిన సమాచారం తెలిస్తే సమీప పోలీస్ స్టేషన్‌కు తెలియజేయాలని, లేదా 1972 లేదా 112 నంబర్లకు కాల్ చేయాలని సూచిస్తూ, అలాగే వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని వారికి భరోసా ఇచ్చారు.

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)

Next Story