Salur: పొలం పిలుస్తోంది’: వరి సాగుపై వ్యవసాయ అధికారి సూచనలు!

Salur: సాలూరు మండలంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం. వరి నాట్లు, తెగుళ్ల నివారణపై ఏవో కీలక సూచనలు చేశారు.

B VENKATESH, SALURU
Published on: 26 Aug 2026 5:03 PM IST
Salur
X

Salur: పొలం పిలుస్తోంది’: వరి సాగుపై వ్యవసాయ అధికారి సూచనలు!

సాలూరు: సాలూరు నియోజకవర్గం లో మామిడిపల్లి మరియు అన్నమరాజవలస గ్రామాల్లో పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని లో మండల వ్యవసాయ అధికారి. మాట్లాడుతూ ప్రస్తుతం నీరు ఉన్న రైతులు వరిలో ఉడుపులు చేయడం (ఉబాలు) జరుగుతుంది కావున వరి ఉడిచేటప్పుడు ఒక చదరపు మీటర్ కు 25 రోజుల నుంచి 30 రోజులు వ్యవధి ఉన్న నారు.

అయితే ఒక చదరపు మీటరుకు 33 కుదుళ్ళు ఉండేటట్లు మరియు ముదురు నారు (35 -55రోజులు ) ఒక చదరపు మీటర్ కు 44 కుదుళ్లు ఉండేటట్లు వరి నాట్లు వేసుకోవాలని అలానే ఉడిచిన వారం రోజులు లోపల కాలిబాటలు ఏర్పాటు చేసుకోవాలని ఈ కాలిబాటలు ఏర్పాటు చేసుకోవడం వలన ఎరువులు మరియు పురుగు మందులు పిచికారి చేసేటప్పుడు రైతులు సులభంగా పొలంలో తిరగడానికి వీలు అవుతుందని మరియు దోమ ఉద్రిక్త తగ్గుతుందని అని తెలియజేశారు.

అలానే ప్రస్తుతం ఎండు ఆకు తెగులు గమనించటం జరుగుతుందని దాని నివారణకు పొలం ఆరబెట్టాలి,నత్రజని వేయకుండా ఆపాలి, Mop వేయటం వల్ల మొక్క తెగులు తట్టుకునే శక్తి పెరుగుతుందని తెలిపేరు, దీని నివారణకు streptocyclin @10gm + copper oxichloride 500gms 200litres నీటి లో కలిపి పిచికారి చేయాలి.

మొక్కజొన్న మరియు వరి పంటలకు పంటల బీమా చేయించుకొనుటకు ఇంకా గడువు ఈనెల 31 వరకు ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు పంటల బీమా చేయించుకోవాలని తెలియజేయడం జరిగింది అలాగే గట్టు మీద చెట్టు లో భాగంగా రైతులు తో కలిసి గట్టు మీద పండ్ల మొక్కలు బంతి నారు మొదలగునవి ఊడటం జరిగింది, దీన వల్ల రైతులకు అదనం గా ఆదాయం వస్తుందని ఈ కార్యక్రమంలో రైతు సేవా కేంద్రం సిబ్బంది, ప్రకృతి వ్యవసాయం సిబ్బంది మరియు రైతులు పాల్గొనడం జరిగింది.

B VENKATESH, SALURU

B VENKATESH, SALURU