Vizianagaram: రేపు ఎల్.కోటకు సీఎం చంద్రబాబు రాక.. ఏర్పాట్ల పరిశీలన!
Vizianagaram: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు విజయనగరం జిల్లా ఎల్.కోటలో పర్యటించనున్నారు.
Vizianagaram: రేపు ఎల్.కోటకు సీఎం చంద్రబాబు రాక.. ఏర్పాట్ల పరిశీలన!
విజయనగరం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు ఎస్.కోట నియోజకవర్గంలో పర్యటించనున్నారు. స్థానిక ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి కుమార్తె వివాహం ఈ నెల 27న జరగనున్న నేపథ్యంలో, ఎల్ కోట .తమ నివాసం లో.సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా విచ్చేసి వధువును ఆశీర్వదించనున్నారు. ముఖ్యమంత్రి రాకను పురస్కరించుకుని అధికారులు, పార్టీ శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు.
సీఎం పర్యటన నేపథ్యంలో సంబంధిత అధికారులు భద్రత మరియు ఇతర ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జిల్లా కలెక్టర్ రామసుందర్ రెడ్డి, జిల్లా ఎస్పీ ఏ.ఆర్. దామోదర్ స్వయంగా పర్యటించి హెలీప్యాడ్ ప్రాంతాన్ని, ముఖ్యమంత్రి కాన్వాయ్ మార్గాలను మరియు సభా ప్రాంగణాన్ని పరిశీలించారు. ఎటువంటి భద్రతా లోపాలు తలెత్తకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు.




