Vizianagaram: నేటినుంచి 'పల్లె పండుగ 3.0'.. రూ.11,085 కోట్లతో పల్లెల ప్రగతి

Vizianagaram: రాష్ట్రవ్యాప్తంగా రూ.11,085 కోట్లతో 'పల్లె పండుగ 3.0' నేటి నుంచి ప్రారంభం. ఉదయగిరి నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ శ్రీకారం.

T Sridhar, Staff Reporter -Vijayanagaram
Published on: 29 Sept 2026 4:32 PM IST
Vizianagaram
X

Vizianagaram: నేటినుంచి 'పల్లె పండుగ 3.0'.. రూ.11,085 కోట్లతో పల్లెల ప్రగతి

Vizianagaram: రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులను బలోపేతం చేస్తూ పల్లెలకు మహర్దశ తెచ్చేందుకు అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'పల్లె పండుగ 3.0' కార్యక్రమం మంగళవారం నుంచి ప్రారంభమవుతోంది.రాష్ట్రవ్యాప్తంగా రూ.11,085 కోట్లతో 'పల్లె పండుగ 3.0' నేటి నుంచి ప్రారంభం. ఉదయగిరి నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ శ్రీకారం.

రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణాభివృద్ధిని పరుగులు పెట్టించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం రూ.11,085 కోట్ల భారీ అంచనా వ్యయంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం రామాపురంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ బృహత్తర కార్యక్రమానికి అంకురార్పణ చేయనున్నారు.

​ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో రవాణా సౌకర్యాలను మెరుగుపరచడానికి రూ.2,700 కోట్ల వ్యయంతో 6,000 కిలోమీటర్ల మేర సిమెంట్ రోడ్లు, మరియు రూ.7,550 కోట్ల వ్యయంతో 9,500 కిలోమీటర్ల తారు రోడ్ల నిర్మాణం చేపట్టనున్నారు.

అలాగే పాడి రైతులకు ఆర్థికంగా భరోసా కల్పించేందుకు రూ.300 కోట్లతో 22,000 మినీ గోకులాల (పశువుల షెడ్లు) నిర్మాణంతో పాటు, ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో రూ.225 కోట్లతో 50,000 ఎకరాల్లో తోటల పెంపకాన్ని ప్రోత్సహించనున్నారు.

వీటితో పాటు రూ.110 కోట్లతో 1,000 కిలోమీటర్ల మేర మ్యాజిక్ డ్రెయిన్లు, రూ.200 కోట్లతో బస్ షెల్టర్లు, గ్రామ పంచాయతీ భవనాలు మరియు రచ్చబండల వంటి ఇతర మౌలిక వసతుల పనులను కూడా ఈ నిధులతో పూర్తి చేయనున్నారు.

​వీటికి అదనంగా వీబీ–జీ రామ్ జి, గ్లోబల్ హార్టికల్చర్ హబ్, నాబార్డ్ తదితర పథకాల ద్వారా కూడా నిధులను అనుసంధానిస్తూ గ్రామాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం సంకల్పించింది.

నేటి నుంచి 4 వ తేదీ వరకు జిల్లాలో జరిగే ఈ పల్లె పండగతో గ్రామాల రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయి. దీనిలో భాగంగా సుమారు 1600 క్యాటిల్ షెడ్లతో బాటు, కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు, బిటి రహదారులను నిర్మించనున్నారు.

ఈ పనులను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తోబాటు ఇతర ప్రజా ప్రతినిధులు తమ నియోజకవర్గాల్లో ప్రారంభించనున్నారు. పల్లె పండుగ పనులను ప్రభుత్వ శాఖలన్నీ సమన్వయంతో నిర్వహించి, త్వరగా పూర్తి చేయాలని సోమవారం కలెక్టరేట్లో జరిగిన ఇంటర్ కోఆర్డినేషన్ మీటింగ్ లో జిల్లా కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి ఆదేశించారు.

T Sridhar, Staff Reporter -Vijayanagaram

T Sridhar, Staff Reporter -Vijayanagaram

మీడియా రంగంలో 9 సంవత్సరాల విస్తృతమైన క్షేత్రస్థాయి అనుభవంతో.. సమకాలీన రాజకీయ, సామాజిక పరిణామాలపై నిశిత పరిశీలన కలిగిన విజయనగరం ‘స్టాఫ్ రిపోర్టర్’.