Parvathipuram: పార్వతీపురంలో ఎస్సీ కమిషన్ గ్రీవెన్స్, ఎమ్మార్వోలతో కీలక సమీక్ష!

Parvathipuram: పార్వతీపురం ఎంపీడీవో కార్యాలయంలో దళితుల సమస్యలపై ఎస్సీ కమిషన్ సభ్యులు రావాడ సీతారాం గ్రీవెన్స్ మరియు తహసిల్దార్లతో సమీక్ష నిర్వహించారు.

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)
Updated on: 10 Sept 2026 4:31 PM IST
Parvathipuram
X

Parvathipuram: పార్వతీపురంలో ఎస్సీ కమిషన్ గ్రీవెన్స్, ఎమ్మార్వోలతో కీలక సమీక్ష!

Parvathipuram: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ గౌరవ చైర్మన్ శ్రీ కె.ఎస్. జవహర్ గారి ఆదేశాల మేరకు, రాష్ట్ర ఎస్సీ కమిషన్ గౌరవ సభ్యులు శ్రీ రావాడ సీతారాం గారు పార్వతిపురం మన్యం జిల్లాలో అధికారికంగా పర్యటించారు.

ఈ కార్యక్రమం పార్వతిపురంలోని MPDO కార్యాలయంలో దళితుల సమస్యలపై ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించి, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించారు.

దళితులు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు తగిన ఆదేశాలు, సూచనలు చేశారు.అనంతరం జిల్లాలోని అందరు MRO లతో కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎస్సీ వర్గాల ప్రజలకు సంబంధించిన భూ సమస్యలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, పెండింగ్‌లో ఉన్న వినతులు, హక్కులు, ప్రభుత్వ సేవలు తదితర అంశాలపై అధికారులతో సమగ్రంగా చర్చించారు.

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)

Next Story