Seetampeta: దివంగత జేఎల్ఎం కుటుంబానికి ఏపీఈఈ యూనియన్ ఆర్థిక భరోసా!
Seetampeta: సీతంపేటలో జేఎల్ఎం బిడ్డిక శంకరరావు మృతి చెందగా, వారి కుటుంబానికి ఏపీఈఈ యూనియన్-1104 రూ. 45,000 ఆర్థిక సాయాన్ని అందజేసింది.
Seetampeta: దివంగత జేఎల్ఎం కుటుంబానికి ఏపీఈఈ యూనియన్ ఆర్థిక భరోసా!
Seetampeta: సీతంపేట సెక్షన్ లోని JLM గ్రేడ్ 2 గా పనిచేస్తున్న శ్రీ బిడ్డిక. శంకరరావు స్వర్గస్తులైనందున, వారి కుటుంబ సభ్యులకు దహన సంస్కా ర ఖర్చుల నిమిత్తం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు డిస్కం కార్యదర్శి శ్రీ గణపతి. వి.యస్.ఆర్.కె గారి ఆదేశాల మేరకు స్టేట్ యూనిట్ నుండి ₹:15,𝟎𝟎𝟎/- లు మరియు డిస్కం యూనిట్ నుండి ₹:𝟑𝟎,𝟎𝟎𝟎/- లు మొత్తం ₹:45,𝟎𝟎𝟎/- చెక్కును మృతిని కుటుంబ సభ్యులకు ఏ.పి.ఇ.ఇ.యూనియన్-𝟏𝟏𝟎𝟒* తరుపున అందజేసి, స్వర్గస్తులైన శ్రీ బిడ్డిక. శంకర రావు గారికి ఘణంగా నివాళులు అర్పించి, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పాలకొండ డివిజనల్ కార్యదర్శి శ్రీ ఇప్పిలి . తౌడు గారు, మరియు డివిజనల్ అధ్యక్షులు శ్రీ టి. అచ్చినాయుడు గారు, డివిజనల్ కార్యనిర్వాహక కార్యదర్శి కొండ్రు. శ్రీను గారు, డివిజనల్ ఉపాధ్యక్షులు శ్రీ జంపు. సత్తయ్య గారు, డివిజనల్ సహాయక కార్యదర్శులు బి. తిరుపతి రావు, మన్మధ రావు మరియు సీతంపేట సెక్షన్ సిబ్బంది యావత్తు పాల్గొనడం జరిగింది.




