Parvathipuram: విధి ఆడిన క్రూర క్రీడ.. మేకల పాక రూపంలో వచ్చిన మృత్యువు!
Parvathipuram: పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలంలో ఈదురుగాలులకు మేకల పాక కూలి ఆశా వర్కర్ రేవతి మృతి చెందారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Parvathipuram: విధి ఆడిన క్రూర క్రీడ.. మేకల పాక రూపంలో వచ్చిన మృత్యువు!
పార్వతిపురం మన్యం జిల్లా: మక్కువ మండలంలోని దెబ్బ గడ్డ పంచాయతీ నగుళ్ళు దబ్బగడ్డ గ్రామానికి చెందిన మువ్వల రేవతి(32) మంగళవారం సాయంత్రం మృతి చెందింది. ఆమె మేకల పాకను శుభ్రం చేయడానికి వెళ్ళింది .అదే సమయంలో ఈదురుగాలులు ఒక్కసారి వేయడంతో లోపల ఉన్న ఆమెపై మేకలు పాక కుప్పకూలిపోవడంతో పాకలో ఇరికిపోవడంతో చుట్టుపక్కల వారు గమనించి పాకను తొలగించి వెంటనే సాలూరు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు భర్త వినోద్ ఇద్దరు కుమార్తెలు ఉన్నారు రేవతి సంబర పిహెచ్సి పరిధిలో సిహెచ్ డబ్ల్యూఓగా(ఆశ వర్కర్) విధులు నిర్వహిస్తుంది. ఆమెతో పాటు ఐదు మేకలు చనిపోవడం జరిగింది ఇలా జరగడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
Next Story




