Parvathipuram: చెరువుల ఆక్రమణలపై మంత్రి అచ్చెన్నాయుడు పవర్‌ఫుల్ వార్నింగ్!

Parvathipuram: ఏపీలో చెరువులు, కుంటల ఆక్రమణలపై కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది.

RAMBABU, TEKKALI
Published on: 17 Jun 2026 8:52 AM IST
Parvathipuram
X

Parvathipuram: చెరువుల ఆక్రమణలపై మంత్రి అచ్చెన్నాయుడు పవర్‌ఫుల్ వార్నింగ్!

Parvathipuram: రాష్ట్రంలోని చెరువులు, కుంటల ఆక్రమణలపై ఉక్కుపాదం మోపాలని, ఎంతటి వారైన వదిలేది లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, జిల్లా ఇంచార్జి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. చెరువుల పరిరక్షణ పట్ల ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించిందని మంత్రి పేర్కొన్నారు. చెరువుల రక్షణే ధ్యేయంగా నడుం బిగించిన సర్కార్, ఆక్రమణదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోందన్నారు. మంగళవారం కలెక్టరేట్లో జరిగిన జిల్లా సమీక్షా మండలి సమావేశంలో మంత్రి పాల్గొని అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

​పార్టీల ప్రసక్తి లేదు.. నిష్పక్షపాతంగా చర్యలు!

​ఈ సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ... చెరువుల్లో ఉన్న అన్ని రకాల ఆక్రమణలను తక్షణమే తొలగించాలని అధికారులను ఆదేశించారు. ఆక్రమణల తొలగింపు విషయంలో ఏ పార్టీ వారైనా సరే, ఎంతటి రాజకీయ రికమండేషన్లు ఉన్నా సరే వదిలిపెట్టే ప్రసక్తి లేదని మంత్రి స్పష్టం చేశారు. పార్టీలకు అతీతంగా, నిష్పక్షపాతంగా చర్యలు తీసుకోవాలని, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం చెరువుల రక్షణకు అధికారులు కట్టుబడి ఉండాలని దిశానిర్దేశం చేశారు. చెరువుల ఆక్రమణల విషయంలో ఎవరినీ ఉపేక్షించవద్దని, రాజకీయాలకు అతీతంగా, సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఆక్రమణలన్నింటినీ పూర్తిగా తొలగించాలని తేల్చిచెప్పారు.

​వెనకడుగు వేసేదే లేదు..

​గతంలో జరిగిన పొరపాట్లు మళ్లీ పునరావృతం కాకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి, ప్రకృతి వనరులను ధ్వంసం చేసే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చెరువుల పరిరక్షణ విషయంలో ప్రభుత్వం ఎంతటి కఠిన నిర్ణయానికైనా వెనకాడదని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

RAMBABU, TEKKALI

RAMBABU, TEKKALI

Next Story