Parvathipuram: దళాయిపేటలో దారుణం పాత కక్షలతో రైతుపై కొడవలితో దాడి!
Parvathipuram: పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం దళాయిపేటలో పాత కక్షలతో రైతు చిన పోల రమేష్‌పై కొడవలితో దాడి చేసిన బెల్లనా లక్ష్మణ్.
Parvathipuram: దళాయిపేటలో దారుణం పాత కక్షలతో రైతుపై కొడవలితో దాడి!
Parvathipuram: పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం పాత కక్షల నేపథ్యంలో ఓ వ్యక్తిపై కొడవలితో దాడి చేసిన ఘటన కొమరాడ మండలంలోని దళాయిపేట గ్రామంలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే, కొమరాడ మండలం కోదులగుంప గ్రామానికి చెందిన చిన పోల రమేష్ అనే రైతు కూలీలను పనికి పిలిచేందుకు సమీపంలోని దళాయిపేట గ్రామానికి వెళ్లాడు. ఈ క్రమంలో గతంలో పొలం రహదారి విషయంలో ఏర్పడిన వివాదం కారణంగా బెల్లనా లక్ష్మణ్ అనే వ్యక్తి రమేష్‌తో వాగ్వాదానికి దిగినట్లు సమాచారం.
వాగ్వాదం తీవ్రరూపం దాల్చడంతో లక్ష్మణ్ కొడవలితో రమేష్‌పై దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు. ఈ దాడిలో రమేష్ తలకు తీవ్ర గాయమై రక్తస్రావం జరిగినట్లు తెలిసింది. గాయపడిన రమేష్‌ను గ్రామస్తులు వెంటనే కురుపాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తోంది. గ్రామంలో ఈ ఘటన కలకలం రేపింది.




