Bobbili: మండలంలో పండుగలా సాగిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ!
Bobbili: విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం గున్నతోటవలస గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది ఎమ్మెల్యే పింఛన్లు అందజేశారు.
Bobbili: బొబ్బిలి మండలంలో పండుగలా సాగిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ
బొబ్బిలి: కూటమి ప్రభుత్వం ప్రతీ నెల 1వ తారీకు సామాజిక భద్రత కోసం వృద్ధులు, వితంతులు, వికలాంగులకు అందించే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు శాసనసభ్యులు ఆర్.వీ.ఎస్.కే.కే.రంగారావు (బేబీ నాయన) బొబ్బిలి
మండలం, గున్నతోటవలస గ్రామంలో టీడీపీ నాయకులు, సచివాలయ సిబ్బందితో కలిసి లబ్ధిదారులకు పింఛను అందజేశారు.
అనంతరం, ఎమ్మెల్యే శ్రీ బేబీనాయన లబ్ధిదారులతో మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం మాట ఇచ్చినవిధంగా ఇప్పటివరకూ ఎటువంటి ఆలస్యం చేయకుండా ప్రతీనెల ఒకటవ తారీఖున పేదలకు, వృద్ధులకు ఆర్ధిక భరోసా ఉండేలా పింఛన్లను సకాలంలో అందిస్తుందని, రాష్ట్ర ప్రజలకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడు అండగా ఉంటుందని తెలిపారు.
కాసేపు లబ్ధిదారులతో మాట్లాడి, వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు, వారికి ఎలాంటి సహాయం కావాలన్నా తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు.




