Balijipeta: పాముకాటుకు గురైన వైసీపీ నేతను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

Balijipeta: పాముకాటుకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బలిజిపేట మాజీ సర్పంచ్ సత్యనారాయణను పరామర్శించిన పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు.

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)
Published on: 3 Aug 2026 8:27 PM IST
Balijipeta
X

Balijipeta: పాముకాటుకు గురైన వైసీపీ నేతను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

బలిజిపేట: బలిజిపెట మండలం, వెంగళరాయపురం గ్రామానికి చెందిన వైసీపీ సీనియర్ నాయకులు తాజా మాజీ సర్పంచ్ గోళ్ళు సత్యనారాయణ ఇటీవల పాము కాటుకు గురై పార్వతీపురం జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతూన్న విషయం స్థానిక నాయకులు ద్వారా తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే శ్రీ అలజంగి జోగారావు గారు సోమవారం నాయకులతో కలిసి ఆసుపత్రికి వెళ్లి సత్యనారాయణను పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

ఇప్పుడు ఉన్న పరిస్థితుల నుంచి పూర్తిగా కోలుకున్నాకనే బయటకు రావాలని అంత వరకు జాగ్రత్తగా ఉండాలని తగు జాగ్రత్తలు చెపుతూ ఆయనకు దైర్యం చెప్పడం జరిగినది. ఈ పరామర్శలో ఆయనతో పాటు జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి పోల సత్యనారాయణ, పట్టణ పార్టీ అధ్యక్షులు కొండపల్లి బాలకృష్ణ, ఆత్మ మాజీ చైర్మన్ యాండ్రాపు తిరుపతిరావు, మాజీ కౌన్సిలర్ ఎన్ సుధీర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)

Next Story