Bhogapuram: భోగాపురం విమానాశ్రయం ప్రధాని సభ ఏర్పాట్లపై మంత్రుల సమీక్ష

Bhogapuram: భోగాపురం ASR ఎయిర్‌పోర్ట్‌లో ప్రధాని మోదీ సభ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు అచ్చెన్నాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి, రాంప్రసాద్ రెడ్డి.

C. RAMESH BABU, ROYCHOTI
Published on: 30 July 2026 3:01 PM IST
Bhogapuram
X

Bhogapuram: భోగాపురం విమానాశ్రయం ప్రధాని సభ ఏర్పాట్లపై మంత్రుల సమీక్ష

భోగాపురం: రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గురువారం విజయనగరం జిల్లా భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించారు.

ASR అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ సభ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి, టెర్మినల్ భవనం, సభా వేదిక, మౌలిక వసతుల పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నాణ్యతతో అన్ని ఏర్పాట్లపై అచ్చెం నాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు సమావేశమై సకాలంలో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. మంత్రి పర్యటనలో పలువురు ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

C. RAMESH BABU, ROYCHOTI

C. RAMESH BABU, ROYCHOTI

Next Story