Kurupam: కురుపాంలో ప్రజల ఇబ్బందులు తీర్చండి: ఎమ్మెల్యేకు బీజేపీ వినతి!
Kurupam: కురుపాం మండల కేంద్రంలో ప్రజా మరుగుదొడ్లు, తాగునీటి వసతి కల్పించాలని కోరుతూ ఎమ్మెల్యే తోయక జగదీశ్వరికి బీజేపీ మండల అధ్యక్షుడు బోటు అనిల్ కుమార్ వినతి.
Kurupam: కురుపాంలో ప్రజల ఇబ్బందులు తీర్చండి: ఎమ్మెల్యేకు బీజేపీ వినతి!
Kurupam: కురుపాం మండల కేంద్రంలో ప్రజల సౌకర్యార్థం మరుగుదొడ్లు నిర్మించి తాగునీటి వసతి కల్పించాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ నాయకులు ఎమ్మెల్యే తోయక జగదీశ్వరికి వినతిపత్రం అందజేశారు.
శుక్రవారం గుమ్మలక్ష్మీపురంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు బోటు అనిల్ కుమార్ ఈ వినతిపత్రాన్ని సమర్పించారు. కురుపాం మండల కేంద్రానికి ప్రతిరోజూ వందలాది మంది ప్రజలు నిత్యావసర వస్తువుల కొనుగోలు, ఇతర పనుల నిమిత్తం రాకపోకలు సాగిస్తుంటారని, గిరిజన రైతులు తమ పంటలను విక్రయించేందుకు వారపు సంతకు వస్తుంటారని తెలిపారు. అలాగే విద్యార్థులు, మహిళలు అధిక సంఖ్యలో ప్రయాణిస్తున్నప్పటికీ ప్రజా మరుగుదొడ్లు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
మరుగుదొడ్లు లేకపోవడంతో ప్రజలు బహిరంగ ప్రదేశాలను ఆశ్రయించాల్సి వస్తోందని, దీనివల్ల పారిశుద్ధ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని వివరించారు. ముఖ్యంగా రావాడ రోడ్ జంక్షన్ మరియు వారపు సంత ప్రాంతాల్లో తక్షణమే మరుగుదొడ్లు నిర్మించి నీటి వసతి కల్పించాలని ఎమ్మెల్యేను కోరారు.
ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి మద్ది దొరబాబు, ఓబీసీ మోర్చా మండల ప్రధాన కార్యదర్శి గెంబలి ప్రదీప్ కుమార్, నెమలిపురి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.




