Bobbili: బొబ్బిలిలో సిఐటియు నిరసన.. మున్సిపల్ ప్రైవేటీకరణ జీవోలపై సమరం
Bobbili: బొబ్బిలిలో మున్సిపల్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సిఐటియు ఆధ్వర్యంలో భారీ సంతకాల సేకరణ జరిగింది.
Bobbili: బొబ్బిలిలో సిఐటియు నిరసన.. మున్సిపల్ ప్రైవేటీకరణ జీవోలపై సమరం
బొబ్బిలి: మున్సిపల్ ఉద్యోగులు,కార్మికులు,పట్టణ ప్రజలకు నష్టదాయకమైన ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పట్టణంలో గల వేణుగోపాలస్వామి గుడి వద్ద సంతకాలు సేకరణ.! మున్సిపల్ రంగంలో వాటర్ సప్లై స్ట్రీట్ లైటింగ్ పార్కులు రోడ్లు వాహనాలు మొదలగు సేవలు ప్రభుత్వం మరియు ప్రైవేటు భాగస్వామ్యం (పిపిపి) పేరుతో ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తూ 975, 673 జీవోలు విడుదల చేసిందని సిఐటియు ఉపాధ్యక్షులు పి.శంకర్రావు అన్నారు.
దీనివలన మున్సిపల్ ఉద్యోగులు కార్మికులు, ఉద్యోగ భద్రతకు ప్రమాదం వాటిల్లుంది రాష్ట్రంలో కోటిన్నర పట్టణ ప్రజల పైన యూజర్ చార్జీలు పేరుతో అదునపు భారాలు మోపుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈ జీవోలు జారీ చేసిందని అన్నారు. వీటిని తక్షణమే ఉపసంహరించుకోవాలని సిఐటియు డిమాండ్ చేస్తున్నది ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో ఉద్యోగులు కార్మికులతో పాటు పట్టణ ప్రజానీకం కూడా పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు.
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నాయకత్వంలో రచించిన భారత రాజ్యాంగం కూడా దేశంలోని ప్రజలందరూ గౌరవంగా జీవించాలంటే అందుకు తగిన విధానాలను రూపొందించి అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలది అని స్పష్టంగా చెప్పింది. ప్రస్తుత కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తూ ప్రైవేటు సంస్థలకు పెద్దపీటవేస్తున్నాయి.
ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని కార్పొరేట్ సంస్థలకు అప్పగించి మున్సిపల్ కార్మికులు మరియు పట్టణ ప్రజలను కష్టాల పాలుచేసేందుకు పిపిపి విధానాన్ని తెస్తున్నారు. మున్సిపాలిటీలు అవినీతి, కరెంటు వృధా వాహనాలు ఎక్కువ కాలం మన్నిక ఉండటం లేదని పాడైపోయిన మిషన్లు వాడటం వల్ల కరెంటు పెట్రోల్ డీజిల్ ఖర్చులు పెరిగిపోయాయని మోడీ గారి నాయకత్వంలోని నీతి అయోగ్ సుద్ధులు చెబుతున్నది. వీటికి అన్నిటికీ బాధ్యత లక్షల రూపాయలు పన్నులు కడుతున్న ప్రజలుదా? ప్రభుత్వాలదా?
మున్సిపాలిటీల అభివృద్ధికి డబ్బులు లేవంట 48 వేల కోట్లు అవసరం అంట కేంద్రంలో మోడీ ప్రభుత్వం గారి ద్వారా ప్రపంచ బ్యాంకు నుండి అప్పు తెచ్చి. 673 జీవో ద్వారా ప్రజల పైన ఇంటి పన్నులు, కుళాయి పన్నులు, చెత్త పన్నులు పెంచుతారు, అన్ని సేవలకు యూజర్ చార్జీలు పేరుతో ప్రజల పైన భారమేయడానికి సిద్ధమయ్యింది. ఈ విధానాన్ని వ్యతిరేకించాల్సిన ప్రతిపక్ష వైసిపి పార్టీ మోడీ ప్రభుత్వాన్ని పల్లెత్తే మాట ఆడడం లేదు.
మన రాష్ట్రం నుండి పట్టణాల నుండి వెళ్తున్న పన్నుల్లో వాటా 40 శాతం రావాలి ఆ డబ్బులు ఇవ్వకుండా అప్పులు ఇచ్చి మన రాష్ట్ర ప్రజల పైన భారాల వేస్తున్న బిజెపి ప్రభుత్వ దుర్మార్గ విధానానికి వ్యతిరేకంగా ప్రజలందరూ పెద్ద ఎత్తున కదలిరావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు బి యుగంధర్ జి గౌరీ జి వాసు బి వెంకట్ కార్మికులు పాల్గొన్నారు.




