Bobbili: బొబ్బిలిలో పెరిగిన ఇంధన ధరలపై సీపీఎం నిరసన
Bobbili: విజయనగరం జిల్లా బొబ్బిలిలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో భారీ ఆందోళనలు జరిగాయి.
Bobbili: బొబ్బిలిలో పెరిగిన ఇంధన ధరలపై సీపీఎం నిరసన
Bobbili: కేంద్రంలో మోడీ ప్రభుత్వం పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలు ఉపసంహరించుకోవాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో బొబ్బిలి పెట్రోల్ బంక్ సెంటర్, కోరాడు సెంటర్ వద్ద ఆందోళనలు జరిగాయి ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు పి. శంకర్రావు మాట్లాడుతూ..
మోడీ ప్రభుత్వం ఐదు రాష్ట్రాల ఎన్నికల అయిన తర్వాత ఆయిల్ ధరలు పెంచి ప్రజలకు తీవ్రమైన ద్రోహం చేస్తున్నారు. యుద్ధాన్ని చూపించి ప్రపంచ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగాయని ధరలను పెంచడం పచ్చి మోసమని అన్నారు. ఇరాన్, రష్యా తక్కువ ధరలకు ఆయిల్ ఇస్తామని చెప్పినప్పటికీ అమెరికా మాట విని వాళ్ల వద్ద కొనకుండా అమెరికాకి లొంగిపోయి ఎక్కువ ధరలకు అమెరికా వద్ద కొని ఈ భారం భారత ప్రజలపై వేస్తున్నారని అన్నారు.
క్రూడాయిల్ ధరలు ఒక బ్యారెల్ 100 డాలర్లు కు ప్రపంచ మార్కెట్లో పెరిగాయని పెంచుతున్నారు. మరి గత 12 సంవత్సరాలుగా క్రూడ్ ఆయిల్ ఒక బేరల్ 30,40 డాలర్లు లోపె ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం 72 రూపాయలకు అమ్మవలసిన డీజిల్ పెట్రోలు 110 రూపాయలకు అమ్మి 30 లక్షల కోట్ల రూపాయలు ప్రజల దగ్గర గుంజుకున్నారు. ఆ డబ్బులు ధరలు పెంచకుండా సర్దుబాటు చేయవచ్చు ఒక లీటర్ పెట్రోల్, డీజిల్ నుండి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు 40 రూపాయలు వసూలు చేస్తున్నారు.
ఆ పన్ను లు తగ్గిస్తే ఇంకా ధరలు తగ్గించవచ్చు అలా కాకుండా ఆదాని, అంబానీల లాభాల కోసం ప్రజలపై భారాలు మోపడం అత్యంత దుర్మార్గమని పచ్చి దేశద్రోహం అని అన్నారు. గ్యాస్ ధరలు పెంచారు భోజనం టిఫిన్లు టీలు అన్ని ధరలు పెరిగాయి. ఆయిల్ ధరలు పెంచుతున్నారు రవాణా చార్జీలు భారం పెరిగి మరలా అన్ని రకాల వస్తువులు ధరలు పెరుగుతాయి. రవాణా రంగంలో లక్షలాదిమంది ఆటోలు ఫోర్ వీలర్స్ నడిపే మోటార్ కార్మికులు ఈ ధరలు పెరగడం వలన తీవ్రంగా నష్టపోతారు.
ఆటో కార్మికులు ఫ్రీ బస్సు వలన ఎప్పటికీ కిరాయి లేక ఇబ్బందులు పడుతున్నారు డీజిల్ పెరుగుదల వలన ఇంకా నష్టపోయి కుటుంబాన్ని పెంచలేక వేరే పని దొరక్క ఆత్మహత్యలు చేసుకునే స్థితికి నెట్టబడుతున్నారు కేంద్ర ప్రభుత్వం పెంచిన ఆయిల్ ధరలు ఉపసంహరించుకోవాలి అని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జి శంకర్రావు గంట శ్రీను రామకృష్ణ కార్మికులు పాల్గొన్నారు.




