Bobbili: బొబ్బిలిలో సిరిమానోత్సవ సంబరాలు.. పోటెత్తిన భక్తజనం!

Bobbili: విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంలో గొల్లపల్లి దాడితల్లి, పాత బొబ్బిలి సరే పోలమ్మతల్లి సిరిమానోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి.

P SRINIVASARAO,	BOBBILI
Published on: 28 April 2026 9:30 PM IST
Bobbili
X

Bobbili: బొబ్బిలిలో సిరిమానోత్సవ సంబరాలు.. పోటెత్తిన భక్తజనం!

Bobbili: బొబ్బిలి పట్టణం గొల్లపల్లి దాడితల్లి, పాత బొబ్బిలి సరే పోలమ్మతల్లి సిరిమనోత్సవాలు అంబరాన్నంటాయి. సరే పోలమ్మతల్లి సిరిమనోత్సవం పాతబొబ్బిలి, బొబ్బిలి, దాడితల్లి సిరిమనోత్సవం గొల్లపల్లి, బొబ్బిలి వీధులలో తిరిగి ఆయా గ్రామాలకు చేరుకొనున్నాయి. గొల్లపల్లి దాడితల్లి గ్రామదేవత పండుగ, పాతబొబ్బిలి సరే పోలమ్మతల్లి గ్రామదేవత పండుగలు సందర్బంగా మంగళవారం సిరిమనోత్సవం నిర్వహించారు.

దాడితల్లి సిరిమనోత్సవాన్ని పూజారి బత్తిన సూర్యారావు, పాత బొబ్బిలి సరే పోలమ్మతల్లి సిరిమనోత్సవాన్ని పూజారి బొబ్బిలి అఖిల్ అధిరోహించారు. సిరిమనోత్సవాన్ని ఎమ్మెల్యే బేబినాయన, మాజీమంత్రి సుజయ కృష్ణరంగారావు, అధికారులు దర్శించుకుని పూజలు చేశారు. సిరిమనోత్సవం సందర్బంగా ఏర్పాటు చేసిన బల్ల వేషాలు ఆకట్టుకున్నాయి. జనంతో రోడ్లు కిక్కిరిసాయి.

P SRINIVASARAO,	BOBBILI

P SRINIVASARAO, BOBBILI

Next Story