Bobbili: బొబ్బిలి వాసులకు గుడ్ న్యూస్.. రూ. 123 కోట్లతో రానున్న తాగునీటి పథకం!

Bobbili: బొబ్బిలిలో రూ. 123.9 కోట్లతో తాగునీటి ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే బేబినాయన. 7500 ఇళ్లకు కుళాయి కనెక్షన్ల కల్పన.

P SRINIVASARAO,	BOBBILI
Published on: 30 May 2026 1:21 PM IST
Bobbili
X

Bobbili: బొబ్బిలి వాసులకు గుడ్ న్యూస్.. రూ. 123 కోట్లతో రానున్న తాగునీటి పథకం!

Bobbili: బొబ్బిలి మున్సిపల్ ప్రజలకు సంపూర్ణంగా తాగునీరు అందించేందుకు ప్రాధాన్యత ఇస్తున్నామని ఎమ్మెల్యే బేబినాయన చెప్పారు. సువర్ణముఖినది నుంచి మున్సిపాలిటీకు ప్రత్యేక పైపులైన్ నిర్మాణానికి రూ.123.9 కోట్లు మంజూరు అయినట్లు చెప్పారు. స్వామివారివీధిలో ట్యాంక్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నిధులతో నాలుగు ఇంఫిల్టర్ బావులు, 90కెఎం పైపులైన్ ఏర్పాటు చేసి 7500 ఇంటి కుళాయి కనెక్షన్లు ఇస్తామన్నారు. గత టీడీపీ హయాంలో నిధులు మంజూరైతే తర్వాత అధికారంలోకి వచ్చిన వైసిపి ప్రభుత్వం నిర్మాణంలో చేయకపోవడంతో నిర్మాణ పనులు ముందుకు సాగలేదన్నారు. 2024లో కూటమి అధికారంలోకి రావడంతో పథకానికి జీవం పోసి నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. పట్టణ ప్రజలకు సంపూర్ణంగా తాగునీరు అందిస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ రాంబార్కి శరత్, కౌన్సిలర్ మరిపి తిరుపతిరావు, కమిషనర్ రామలక్ష్మి, పబ్లిక్ హెల్త్ ఇఇ, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

P SRINIVASARAO,	BOBBILI

P SRINIVASARAO, BOBBILI

Next Story