Bobbili: ఎమ్మెల్యే బేబీ నాయనను కలిసిన బ్రహ్మన్నవలస ఏజీ పేట గ్రామస్థులు

Bobbili: ఎమ్మెల్యే బేబీ నాయనను కలిసిన బాడంగి మండలం బ్రహ్మన్నవలస గ్రామ ప్రజలు, కోడూరు రోడ్డు మరమ్మతులు, తాగునీటి సమస్యను వేగంగా పరిష్కరించాలని కోరారు.

P SRINIVASARAO,	BOBBILI
Published on: 28 July 2026 4:25 PM IST
Bobbili
X

Bobbili: ఎమ్మెల్యే బేబీ నాయనను కలిసిన బ్రహ్మన్నవలస ఏజీ పేట గ్రామస్థులు

బొబ్బిలి: బొబ్బిలి నియోజకవర్గం, బాడంగి మండలం, బ్రహ్మన్నవలస (ఏజీ పేట) గ్రామానికి చెందిన మహిళలు, గ్రామస్తులు ఈరోజు శాసనసభ్యులు ఆర్.వీ.ఎస్.కె.కె.రంగారావు (బేబీ నాయన) ని బొబ్బిలి కోటలో కలిసి తమ గ్రామానికి కోడూరు నుంచి ఉన్న రోడ్డు పాడయ్యిందని, గ్రామస్థులు ఇబ్బంది పడుతున్నారని ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకురాగా, పిఆర్ డిఈ గారుతో మాట్లాడి వర్షాకాలం పూర్తవగానే ఆ రోడ్డు పనులు ప్రారంభించాలని సూచించారు.

అలాగే, కొన్ని వీధులలో మంచినీటి సమస్య ఉందని తెలుపగా, RWS డిఈ తో ఫోనులో మాట్లాడి, సత్వరమే త్రాగునీటి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు.

P SRINIVASARAO,	BOBBILI

P SRINIVASARAO, BOBBILI

Next Story