Bobbili: నవధాన్యాల విత్తనాల పంపిణీ.. పాల్గొన్న ఎమ్మెల్యే బేబీ నాయన

Bobbili: బొబ్బిలి ఏఎంసీ కార్యాలయంలో ప్రకృతి వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నవధాన్యాల విత్తనాలను ఎమ్మెల్యే బేబీ నాయన పంపిణీ చేశారు.

P SRINIVASARAO,	BOBBILI
Published on: 21 May 2026 5:55 PM IST
Bobbili
X

Bobbili: నవధాన్యాల విత్తనాల పంపిణీ.. పాల్గొన్న ఎమ్మెల్యే బేబీ నాయన

బొబ్బిలి: ఏఎంసీ కార్యాలయ ఆవరణలో ప్రకృతి వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో "నవధాన్యాల సాగు" కోసం విత్తనాల పంపిణీ కార్యక్రమంలో శాసనసభ్యులు ఆర్.వీ.ఎస్.కె.కె.రంగారావు (బేబీ నాయన) పాల్గొని, రైతులకు నవధాన్యాల కిట్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బేబీనాయన మాట్లాడుతూ, భూములు సారవంతంగా ఉండేందుకు 20 నుంచి 30 రకాల విత్తనాల మిశ్రమం గల నవధాన్యాలను ఎకరానికి 15 నుంచి 25 కేజీలను వేసుకోవాలని సూచించారు.

ప్రకృతి వ్యవసాయ సంస్థ ద్వారా గతంలో 10కేజీల బరువు గల మిశ్రమాన్ని ఇచ్చేవారని, ఇప్పుడు 15కేజీల మిశ్రమం ఇస్తున్నామని తెలిపారు.. భూసారం పెంచేందుకు తీసుకుంటున్న చర్యలలో భాగంగా నియోజకవర్గ స్థాయిలో పనిచేస్తున్న వారికి తాను కూడా కొన్ని సూచనలు చేస్తున్నానని తెలిపారు.. పూర్తిగా రసాయన ఎరువులకు అలవాటుపడిన మన భూములను నెమ్మదిగా ప్రకృతి వ్యవసాయం ద్వారా పూర్వ సారాన్ని పునరుద్ధరించేలా ప్రణాళికలు చేస్తున్నామని, తద్వారా క్యాన్సర్ వంటి రోగాలకు అడ్డుకట్ట వేసేందుకు కృషి చేస్తున్నామని వివరించారు.

అలాగే, భూసారాన్ని పెంచడానికి మరియు రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించడానికి నవధాన్యాల సాగు (పచ్చిరొట్ట ఎరువు) అత్యంత శ్రేయస్కరమని, తొలకరి వర్షాలకు ముందు లేదా రెండు పంటల మధ్య కాలంలో వీటిని సాగు చేస్తారని అన్నారు..దీనివల్ల మట్టికి సహజ నత్రజని, పోషకాలు అందుతాయని, వేసవిలో లేదా రెండు ప్రధాన పంటల మధ్యలో ఖాళీగా ఉన్న సమయంలో వీటిని విత్తుకోవాలని.

ఈ పంటలు వేగంగా పెరిగి నేలకి అవసరమైన సేంద్రీయ కర్బనాన్ని అందిస్తాయని, పంట పూత దశకు రాగానే (విత్తనాలు పడకముందే) వీటిని భూమిలో కలియదున్నాలని, వీటి వేర్లు భూమి లోపలికి చొచ్చుకుపోయి గాలిలోని నత్రజనిని నేలలో స్థిరీకరిస్తాయని తెలిపారు..భూమిని నమ్ముకునే రైతులకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ నర్సుపల్లి వెంకటనాయుడు, బొబ్బిలి మండల టీడీపీ అధ్యక్షులు వాసిరెడ్డి సత్యనారాయణ , టీడీపీ సీనియర్ నాయకులు అల్లాడ భాస్కర్రావు, పలు గ్రామాల మాజీ సర్పంచులు, టీడీపీ నాయకులు, వ్యవసాయశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

P SRINIVASARAO,	BOBBILI

P SRINIVASARAO, BOBBILI

Next Story