Bobbili: బొబ్బిలి కోటలో రక్తదాన శిబిరం.. ప్రారంభించిన ఎమ్మెల్యే బేబీ నాయన!

Bobbili: బొబ్బిలి శాసనసభ్యులు ఆర్.వీ.ఎస్.కె.కె.రంగారావు (బేబీ నాయన) పుట్టినరోజును పురస్కరించుకుని బొబ్బిలి కోటలో భారీ రక్తదాన శిబిరం నిర్వహించారు.

P SRINIVASARAO,	BOBBILI
Published on: 23 Jun 2026 12:49 PM IST
Bobbili
X

Bobbili: బొబ్బిలి కోటలో రక్తదాన శిబిరం.. ప్రారంభించిన ఎమ్మెల్యే బేబీ నాయన!

బొబ్బిలి: రేపు అనగా జూన్ 24, బుధవారం నాడు శాసనసభ్యులు ఆర్.వీ.ఎస్.కె.కె.రంగారావు (బేబీ నాయన) పుట్టినరోజు సందర్భంగా.. ఈరోజు బొబ్బిలి కోటలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది.. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బేబీనాయన ఈరోజు ఉదయం ప్రారంభించి, రక్తదానం చేయడానికి వచ్చిన వారిని అభినందించి, వారికి సర్టిఫికెట్లను అందజేశారు.

పాతబొబ్బిలి దయగలగోడ వ్యవస్థాపకులు మింది విజయమోహన్ మాస్టారు బేబీనాయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో 93వ సారి రక్తదానం చేశారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు అల్లాడ భాస్కరరావు బొబ్బిలి పట్టణ టీడీపీ అధ్యక్షులు గెంబలి శ్రీనివాసరావు బొబ్బిలి మండలం టీడీపీ అధ్యక్షులు వాసిరెడ్డి సత్యనారాయణ జనసేన పార్టీ నాయకులు మనోజ్ బాబీ,టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

P SRINIVASARAO,	BOBBILI

P SRINIVASARAO, BOBBILI

Next Story