Bobbili: బొబ్బిలిలో ‘ఆపరేషన్ క్లీన్ స్వీప్’.. స్వయంగా పాల్గొన్న ఎమ్మెల్యే బేబీ నాయన!

Bobbili: బొబ్బిలిలో 'ఆపరేషన్ క్లీన్ స్వీప్' ప్రారంభించిన ఎమ్మెల్యే బేబీ నాయన. ఏపీ వ్యాప్తంగా 4 వారాల పాటు జరిగే పారిశుద్ధ్య స్పెషల్ డ్రైవ్ యాక్షన్ ప్లాన్ విడుదల.

P SRINIVASARAO,	BOBBILI
Published on: 23 May 2026 1:15 PM IST
Bobbili
X

Bobbili: బొబ్బిలిలో ‘ఆపరేషన్ క్లీన్ స్వీప్’.. స్వయంగా పాల్గొన్న ఎమ్మెల్యే బేబీ నాయన!

Bobbili: ఈరోజు నుంచి ‘ఒక రాష్ట్రం.. ఒక పరిశుభ్రత లక్ష్యం’ నినాదంతో ఏపీవ్యాప్తంగా ఆపరేషన్ క్లీన్ స్వీప్‌కు ఏపీ ప్రభుత్వం పిలుపునిచ్చింది. బొబ్బిలి మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో శాసనసభ్యులు ఆర్.వీ.ఎస్.కె.కె.రంగారావు (బేబీ నాయన) పాల్గొనడం జరిగింది.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బేబీనాయన మాట్లాడుతూ..ఏపీలో నాలుగు వారాల పాటు ఈ కార్యక్రమం చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. మొదటి వారంలో రోడ్లు, ప్రజలు ఉండే ప్రాంతాలను పరిశుభ్రం చేస్తారని, రెండోవారం కాలువలన్నిటినీ క్లీనింగ్ చేసే దాంట్లో ఒక వారం పాటు ప్రజల భాగస్వామ్యులు అవ్వాలని చెప్పారు. మూడోవారం ఇళ్లు, కమర్షియల్ ఇన్‌స్టిట్యూట్స్ ఏదైతే చెత్త ఉందో దాన్ని సెగ్రిగేషన్ చేసే దాంట్లో భాగస్వామ్యలు అవుతామని, నాలుగోవారం పబ్లిక్ టాయిలెట్స్ పరిశుభ్రతలో పాల్గొంటామని అన్నారు.

మన చుట్టుపక్కల శానిటేషన్ బావుండాలంటే, ప్రజల సహకారం కూడా ఉండాలని,అందుకు వారు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.గత ప్రభుత్వ హయాంలో చెత్తపై పన్ను వేసి, ఎక్కడకక్కడ చెత్తను కుప్పలుగా వదిలేశారని అన్నారు.. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత, కొన్ని వేల టన్నుల చెత్తను యుద్ధప్రాతిపదికన శుభ్రం చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో మరియు స్పెషల్ ఆఫీసర్ జె.వి.ఎస్.ఎస్.రామ్మోహన్ రావు, బొబ్బిలి పట్టణ టీడీపీ అధ్యక్షులు గెంబలి శ్రీనివాసరావు, టీడీపీ నాయకులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

P SRINIVASARAO,	BOBBILI

P SRINIVASARAO, BOBBILI

Next Story