Bobbili: బొబ్బిలి రూ. 2 లక్షల బీమా చెక్కు అందజేత

Bobbili: బొబ్బిలిలో రూ. 2 లక్షల PMSBY బీమా చెక్కును అందజేసిన డీసీసీబీ అధికారులు. ప్రమాదంలో మృతి చెందిన మహిళా కూలీ కుటుంబానికి అందిన ఆర్థిక సాయం.

P SRINIVASARAO,	BOBBILI
Published on: 14 July 2026 7:33 PM IST
Bobbili
X

Bobbili: బొబ్బిలి రూ. 2 లక్షల బీమా చెక్కు అందజేత

బొబ్బిలి: బొబ్బిలి పట్టణం గొల్లవీధికి చెందిన గొలగాన అప్పయ్యమ్మ కుటుంబానికి ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన (PMSBY) పథకం కింద రూ.2 లక్షల భీమా చెక్కును బొబ్బిలి డీసీసీబీ బ్యాంకు శాఖ చీఫ్ మేనేజర్ రామకృష్ణ, మేనేజర్లు శ్రీదేవి, శశిభూషణ్‌రావు అందజేశారు.

అప్పయ్యమ్మ కూలీ పనితో జీవనం సాగిస్తూ ప్రతి సంవత్సరం రూ.20 చెల్లించి ఈ భీమా పథకంలో సభ్యురాలిగా కొనసాగారు. ఇటీవల గోడ కూలిన ప్రమాదంలో ఆమె మృతి చెందడంతో, నామినీగా ఉన్న కుమారుడు మురళికి భీమా వర్తించింది.

సొసైటీ ఫర్ సోషల్ ట్రాన్స్‌ఫార్మేషన్ (SST) ఆధ్వర్యంలోని ఆర్థిక అక్షరాస్యత కేంద్రం కౌన్సిలర్లు లక్ష్మణరావు, రాధ, చంటి అవసరమైన పత్రాలను సేకరించి భీమా క్లెయిమ్ త్వరగా మంజూరయ్యేలా సహకరించారు.

ఈ సందర్భంగా మురళి, బ్యాంకు సిబ్బందికి, కౌన్సిలర్లకు, అలాగే వారిని ప్రోత్సహించిన ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆంజనేయులు, ప్రాజెక్ట్ మేనేజర్ అశోక్‌లకు కృతజ్ఞతలు తెలిపారు.

P SRINIVASARAO,	BOBBILI

P SRINIVASARAO, BOBBILI

Next Story