Bobbili: డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి శంబంగి
Bobbili: బొబ్బిలిలో వైసీపీ సమావేశం. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని, ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించాలని మాజీ ఎమ్మెల్యే శంబంగి డిమాండ్.
Bobbili: డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి శంబంగి
బొబ్బిలి: రాష్ట్రంలో డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు డిమాండ్ చేశారు. బొబ్బిలి వైసీపీ కార్యాలయంలో మంగళవారం సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలు అమలు చేయకుండా మోసం చేసిందని విమర్శించారు.
అలాగే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ వెంటనే చెల్లించాలని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగులకు నెలకు 3,000 రూపాయల భృతి ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ వైఫల్యాలపై ఈనెల 6 నుంచి 9 వరకు మండల కేంద్రాల్లో నిరాహారదీక్షలు, 10న బొబ్బిలిలో భారీ ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బొబ్బిలి నియోజకవర్గంలో నాలుగు మండలాల వైఎస్ఆర్ సీపీ నేతలు, కార్యకర్తలు,పాల్గొన్నారు.
Next Story




