విజయనగరం: విజయనగరం జిల్లాలో గ్రామదేవతల పండుగల్లో బొత్స ఝాన్సీ లక్ష్మి పాల్గొనడం
విజయనగరం: విజయనగరం జిల్లాలోని పలు గ్రామ దేవతల పండుగల్లో మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ లక్ష్మి పాల్గొని అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
విజయనగరం
విజయనగరం: విజయనగరం జిల్లాలోని పలు గ్రామ దేవతల పండుగ మహోత్సవాల్లో మాజీ పార్లమెంట్ సభ్యురాలు బొత్స ఝాన్సీ లక్ష్మి పాల్గొన్నారు. వివిధ ఆలయాలను సందర్శించి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మొదటగా బొబ్బిలి మండలం గొల్లపల్లి గ్రామంలో జరిగిన శ్రీ శ్రీ శ్రీ దాడితల్లి అమ్మవారి పండుగ మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బొబ్బిలి పట్టణంలో సరిపొల్లమ్మ అమ్మవారి సిరిమానోత్సవం సందర్భంగా ఆలయాన్ని సందర్శించి పూజలు నిర్వహించారు.
తదుపరి సాలూరు నియోజకవర్గంలోని జక్కువ గ్రామంలో జరిగిన శ్రీ శ్రీ శ్రీ బాల త్రిపుర సుందరీ సమేత జగదీశ్వర స్వామి వారి దేవాలయ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమాల్లో బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే సంబంగి చిన్న అప్పలనాయుడు, సావు వెంకట మురళీకృష్ణారావు, చోడుగంజి రమేష్ నాయుడు, ఎల్. అప్పలనాయుడు, ఆలయ ధర్మకర్తలు, గ్రామ పెద్దలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.




