Cheepurupalli: కూటమి వైఫల్యాలపై బొత్స సత్యనారాయణ నిప్పులు

Cheepurupalli: వైఎస్ జగన్ పిలుపు మేరకు శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు.

G SIMHACHALAM,	CHIPURPALLY
Published on: 12 Jun 2026 3:36 PM IST
Cheepurupalli
X

Cheepurupalli: కూటమి వైఫల్యాలపై బొత్స సత్యనారాయణ నిప్పులు

Cheepurupalli: మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు చీపురుపల్లి నియోజకవర్గ కేంద్రంలో గురువారం "వెన్నుపోటుకు రెండేళ్లు" నిరసన ర్యాలీ విజయవంతంగా జరిగింది. శాసనమండలి ప్రతిపక్ష నేత శ్రీ బొత్స సత్యనారాయణ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

చీపురుపల్లి సిటీ కేబుల్ సమీపంలోని పెట్రోల్ బంకు నుండి గాంధీ సెంటర్ వరకు జరిగిన ఈ ర్యాలీలో మాజీ ఎంపీ శ్రీ బెల్లాన చంద్రశేఖర్ గారు, డాక్టర్ శ్రీమతి బొత్స అనూష గారు, డాక్టర్ శ్రీ బొత్స సందీప్ గారు, నియోజకవర్గ పరిశీలకులు శోభా స్వాతి రాణి గారు పాల్గొన్నారు. నాలుగు మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలు, పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొనడంతో చీపురుపల్లి పట్టణం దద్దరిల్లింది.

బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ:

"ఎన్నికల సమయంలో ఎన్నో హామీలు ఇచ్చిన ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైంది. ధరలు పెరిగాయి, నిరుద్యోగ సమస్య అలాగే ఉంది, అభివృద్ధి పనులు మందగించాయి. ప్రజలను మోసం చేసిన ఈ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ వైఎస్ జగన్ గారి ఆధ్వర్యంలో మా పోరాటం కొనసాగుతుంది" అని అన్నారు.

డాక్టర్ బొత్స అనూష:

ఈ సందర్భంగా "ఆనాడు మీకు... నేడు ప్రజలకు: ఎన్టీఆర్ గారికి బహిరంగ లేఖ"ను విడుదల చేశారు. చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ పేరుతో హామీలు ఇచ్చి ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చారని, అమలులో విఫలమయ్యారని ఆరోపించారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహం వద్ద పార్టీ శ్రేణులతో కలిసి ప్రజా పోరాటం చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. నాన్న గారు బొత్స సత్యనారాయణ గారి సూచనలతో ప్రజల పక్షాన నిరంతరం పోరాడతామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సంక్షేమ పథకాల బాధితులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

G SIMHACHALAM,	CHIPURPALLY

G SIMHACHALAM, CHIPURPALLY

Next Story