Kurupam: కురుపాంలో పశువుల అక్రమ రవాణా గుట్టురట్టు!
Kurupam: పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో పశువులను అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసి, 6 మూగజీవాలు, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
Kurupam: కురుపాంలో పశువుల అక్రమ రవాణా గుట్టురట్టు!
Kurupam: పార్వతీపురం మన్యం జిల్లా పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కురుపాం పోలీసులు ఆదివారం ఉదయం ముందస్తు సమాచారంతో కురుపాం గ్రామ సమీపంలోని ఎలక్ట్రికల్ సబ్‌స్టేషన్ వద్ద తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా AP 39 WJ 6360 నంబర్ గల వాహనంలో ఆరు పశువులను అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు.
పోలీసుల విచారణలో ఈ పశువులను భామిని గ్రామం నుంచి నవగాం గ్రామానికి వధ నిమిత్తం తరలిస్తున్నట్లు వెల్లడైంది. ఘటనకు సంబంధించి పొట్నూరు శంకరరావు (45), బడ్డుమాసింగి గ్రామం, జంపరకోట పంచాయతీ, పాలకొండ మండలానికి చెందిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
పశువులను క్రూరంగా, చట్టపరమైన నిబంధనలను ఉల్లంఘిస్తూ రవాణా చేసినందుకు సంబంధిత చట్టాల కింద కేసు నమోదు చేసిన పోలీసులు, ఆరు పశువులతో పాటు రవాణాకు ఉపయోగించిన వాహనాన్ని మధ్యవర్తుల సమక్షంలో పంచనామా నిర్వహించి స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. పశువుల అక్రమ రవాణా, క్రూరత్వం లేదా చట్టవిరుద్ధంగా వధకు తరలించడం వంటి చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇటువంటి ఘటనలు గమనించిన ప్రజలు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కురుపాం పోలీసులు కోరారు.




