Merakamudidam: మెరకముడిదాంలో టీడీపీలోకి భారీ చేరికలు 2,000 కుటుంబాలు చేరిక
Merakamudidam: చీపురుపల్లి నియోజకవర్గం మెరకముడిదాంలో టీడీపీలోకి భారీ చేరికలు. ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు, మజ్జి శ్రీనివాసరావు సమక్షంలో 2000 కుటుంబాలు చేరిక.
Merakamudidam: మెరకముడిదాంలో టీడీపీలోకి భారీ చేరికలు 2,000 కుటుంబాలు చేరిక
మెరకముడిదాం: చీపురుపల్లి నియోజకవర్గం మెరకముడిదాం మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీలోకి భారీ చేరికల కార్యక్రమం ఘనంగా జరిగింది. శివరామకృష్ణ వరప్రసాద్ రాజు, సీతారామరాజు రాజు, హరిబాబు గార్ల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు గారి సమక్షంలో సుమారు 2,000 కుటుంబాలు టీడీపీలో చేరాయి.
టీడీపీ అరకు పార్లమెంట్ పరిశీలకులు, ఉమ్మడి విజయనగరం జెడ్పీ మాజీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) గారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చిన్న శ్రీను గారు మాట్లాడుతూ - "నన్ను నమ్మి నాతో నడుస్తున్న ప్రతి కార్యకర్తను ఎప్పటికీ మర్చిపోను. కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటా. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాలన్నీ గెలవడమే లక్ష్యంగా ఐక్యంగా పనిచేయాలి" అని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడు, కిమిడి మల్లిక్ నాయుడు, మాజీ జెడ్పీటీసీలు కోట్ల వెంకటరావు, వర్రీ నరసింహమూర్తి, బూర్లె నరేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.




