Cheepurupalli: చీపురుపల్లిలో డ్రగ్స్, గంజాయి నిర్మూలనపై పోలీసుల అవగాహన!
Cheepurupalli: విజయనగరం జిల్లా చీపురుపల్లిలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఎస్డీపీఓ రాఘవులు ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
Cheepurupalli: చీపురుపల్లిలో డ్రగ్స్, గంజాయి నిర్మూలనపై పోలీసుల అవగాహన!
చీపురుపల్లి: చీపురుపల్లి లో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయనగరం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చీపురుపల్లి త్రీ రోడ్స్ జంక్షన్ వద్ద డ్రగ్స్, గంజాయి నిర్మూలనపై ప్రజా అవగాహన కార్యక్రమం ఘనంగా జరిగింది.
జిల్లా SP గారి ఉత్తర్వుల మేరకు, చీపురుపల్లి SDPO శ్రీ రాఘవులు గారి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ జి. శంకరావు, గరివిడి SI, బుదరాయవలస SI తో పాటు పెద్ద సంఖ్యలో పోలీసు సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా SDPO రాఘవులు గారు మాట్లాడుతూ, "మాదకద్రవ్యాలు యువత జీవితాలను, కుటుంబాలను, సమాజాన్ని నాశనం చేస్తున్నాయి. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి చదువు, ఉద్యోగం, క్రీడలపై దృష్టి పెట్టాలి" అని పిలుపునిచ్చారు.
డ్రగ్స్ సంబంధిత కార్యకలాపాలపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని, సమాచారం ఇచ్చిన వారి గుర్తింపును గోప్యంగా ఉంచుతామని ఆయన హామీ ఇచ్చారు.




