Cheepurupalli: ప్రజల గుండెల్లో వైసీపీ ఉంది.. కార్యకర్తలు అధైర్యపడొద్దు
Cheepurupalli: విజయనగరం జిల్లా గరివిడిలో వైఎస్సార్సీపీ విస్తృత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది.
Cheepurupalli: ప్రజల గుండెల్లో వైసీపీ ఉంది.. కార్యకర్తలు అధైర్యపడొద్దు
Cheepurupalli: పదవులు ఉన్నాయా లేదా అన్నది ముఖ్యం కాదు. ప్రజల గుండెల్లో వైసీపీకి శాశ్వత స్థానం ఉంది. అధికారంలో లేకపోయినా ప్రజల పక్షాన నిలబడి రాజీలేని పోరాటం చేస్తాం" అని వైసీపీ యువ నాయకురాలు డాక్టర్ బొత్స అనూష స్పష్టం చేశారు.
శాసనమండలి ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ గారి ఆదేశాల మేరకు శనివారం గరివిడి క్యాంప్ కార్యాలయంలో మెరకముడిదం మండల క్లస్టర్, డివిజన్ ఇంచార్జ్‌లు, బూత్ ఏజెంట్లతో నిర్వహించిన విస్తృత స్థాయి సమీక్షా సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని కార్యకర్తల్లో నూతన ఉత్సాహం నింపారు.
కేడర్‌కు దిశానిర్దేశం చేసిన డాక్టర్ అనూష
ఈ సందర్భంగా డాక్టర్ బొత్స అనూష ఎంతో ఉద్వేగభరితంగా మాట్లాడుతూ "రాజకీయాల్లో గెలుపోటములు సహజం. అంతమాత్రానికే అధైర్యపడాల్సిన పనిలేదు. మన నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆశయాలతో, పెద్దలు బొత్స సత్యనారాయణ గారి మార్గదర్శకత్వంలో మెరకముడిదం మండలంలో పార్టీని మరింత పటిష్టం చేయాలి. కేడర్ అంతా విభేదాలు పక్కన పెట్టి, ఐక్యమత్యంతో ఒకే తాటిపై నడవాలి. ప్రభుత్వ వైఫల్యాలను క్షేత్రస్థాయిలో ఎండగట్టి, ప్రజా సమస్యలపై పోరాటానికి సిద్ధం కావాలి" అని పిలుపునిచ్చారు.
జడ్పీ చైర్మన్, బొత్స సందీప్ హాజరు
ఈ సమావేశంలో జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఓటర్ల జాబితాపై ప్రత్యేక నిఘా పెట్టాలని, అక్రమ తొలగింపులను అడ్డుకోవాలని సూచించారు. యువ నాయకులు డాక్టర్ బొత్స సందీప్ మాట్లాడుతూ పార్టీ నమ్ముకున్న కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని భరోసా ఇచ్చారు.
మాజీ డీసీఎంఎస్ చైర్మన్ సిరువూరు రమణరాజు, కోట్ల వెంకట్రావు, తాడ్డి వేణు, బుర్లె నరేష్ కుమార్, హరిబాబు, రాము, పొన్నాడ కుమార్‌తో పాటు మండల ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్‌లు, జేసీఎస్ కన్వీనర్లు, గృహసారథులు, భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. డాక్టర్ బొత్స అనూష ప్రసంగం కార్యకర్తల్లో సరికొత్త ఉత్సాహాన్ని, గెలుపు కసిని నింపింది.




