Cheepurupalli: ఎమ్మెల్యే కల వెంకటరమణకు ఫీల్డ్ అసిస్టెంట్ల వినతిపత్రం
Cheepurupalli: చీపురుపల్లి నియోజకవర్గంలో ఫీల్డ్ అసిస్టెంట్లు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎమ్మెల్యే కళా వెంకటరమణకు సామూహికంగా వినతిపత్రం అందజేశారు.
Cheepurupalli: ఎమ్మెల్యే కల వెంకటరమణకు ఫీల్డ్ అసిస్టెంట్ల వినతిపత్రం
చీపురుపల్లి: విజయనగరం జిల్లా చీపురుపల్లి నీయోజక వర్గం లో గల నాలుగు మండలాల గుర్ల మండలం. గరివిడి మండలం. చీపురుపల్లి మండలం మెరకముడిదాం మండలం లాలూ కు సంబందించి ఫీల్డ్ అసిస్టెంట్ లు అందరు కలిసి సామూహింగా వారి డిమాండ్ లు సామరస్య పూర్వకంగా ఏం ఎల్ ఏ. కళా కి వినతి పత్రం అందజేశారు.
తదనంతరం. నాలుగు మండలాల యూనియన్ నాయకులు మాట్లాడుతూ. కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చి ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు కు పనికి తగిన వేతనం ఇస్తుంది అని మేము అందరం అనుకున్నము. ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం భారత దేశం లో ఉన్న ప్రతి పౌరులు కు పని చేసే హక్కు కల్పించారు.
కార్మికులు కు పని గంటలు తగ్గించారు.కనీసం వేతనం ఇవ్వాలి. అని రాజ్యాంగం లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పొందుపరిచారు. అలాగే గ్రామస్థాయి లో ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ లు పాత్ర చాలా కీలకం. వారు సేవలు అమోఘం.కనుక మాకు ప్రభుత్వం కనీస వేతనం 26 వేలు రూపాయలు ఇవ్వాలి.
మా ఉద్యోగానికి భరోసా ఇవ్వాలి. మా ఉద్యోగం లలో బదిలీ లు కల్పించాలి.ఎటువంటి నోటీసులు జారీ చేయకుండా కొంతమంది ఫీల్డ్ అసిస్టెంట్ లు తొలిగిస్తున్నారు. వారందరిని. తక్షణమే విధుల్లో కి తీసుకోవాలి. మా కుటుంబాలకు ప్రభుత్వాలు ఆర్థిక భరోసా కల్పించాలి.
రాష్టం మొత్తం పెండింగ్ లో ఉన్న మా ఫీల్డ్ అసిస్టెంట్ లు వేతన బకాయిలు తక్షణమే చెల్లించాలి. లేని పక్షం లో మేము అందరం రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ మాసంలో రాస్తాకో నిర్వహిస్తామని అన్నారు.ఈ కార్యక్రమం లో నాలుగు మండలాల యూనియన్ నాయకులు మరియు ఫీల్డ్ అసిస్టెంట్లు అందరు పాల్గొన్నారు.




