Cheepurupalli: సెరిపేటలో ‘రెండేళ్ల నమ్మకం’ – MLA కళా వెంకటరావు

Cheepurupalli: గరివిడి మండలం సెరిపేటలో ‘రెండేళ్ల నమ్మకం’ డోర్ టు డోర్ ప్రచారం చేపట్టిన MLA కళా వెంకటరావు. కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన.

G SIMHACHALAM,	CHIPURPALLY
Published on: 30 July 2026 9:30 PM IST
Cheepurupalli
X

Cheepurupalli: సెరిపేటలో ‘రెండేళ్ల నమ్మకం’ – MLA కళా వెంకటరావు

చీపురుపల్లి: చీపురుపల్లి నియోజకవర్గం గరివిడి మండలం సెరిపేట గ్రామంలో ఈరోజు మాజీ మంత్రివర్యులు, చీపురుపల్లి శాసనసభ్యులు శ్రీ కిమిడి కళా వెంకటరావు గారు "రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం" డోర్ టు డోర్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుస్తూ, కూటమి ప్రభుత్వం గత 2 ఏళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలను, అభివృద్ధి పనులను వివరించారు.

ఆయన ప్రసంగంలో ముఖ్యాంశాలు:

1. తల్లికి వందనం: చదువుకునే ప్రతి విద్యార్థికి ₹13,000 నేరుగా తల్లి ఖాతాలో

2. మహిళలకు ఉచిత బస్సు: లక్షలాది మంది మహిళలకు ఆర్థిక భారం తగ్గింది

3. భోగాపురం ఎయిర్పోర్ట్: ఉత్తరాంధ్రకు పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు

4. రైతు సంక్షేమం: అన్నదాత సుఖీభవ ద్వారా ఆర్థిక సహాయం

5. ఆటో డ్రైవర్లకు ₹15,000 ఆర్థిక సహాయం

6. పెన్షన్లు: అర్హులందరికీ సకాలంలో పెంపు

7. ఉద్యోగాలు: మెగా DSC, కానిస్టేబుల్ భర్తీలతో యువతకు భరోసా

"ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నాం. సెరిపేట గ్రామ అభివృద్ధికి మరిన్ని నిధులు తెస్తాం" అని ఆయన హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గారు, నియోజకవర్గ పరిశీలకులు పుచ్చా విజయ్ కుమార్ గారు, కోలా నాగేశ్వరావు గారు తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

G SIMHACHALAM,	CHIPURPALLY

G SIMHACHALAM, CHIPURPALLY

Next Story