Cheepurupalli: చీపురుపల్లి పంచాయతీకి అంతర్జాతీయ ఐఎస్‌ఓ (ISO) గుర్తింపు

Cheepurupalli: విజయనగరం జిల్లా చీపురుపల్లి మేజర్ పంచాయతీకి ISO-9001-2015 ధ్రువీకరణ లభించింది.

G SIMHACHALAM,	CHIPURPALLY
Published on: 21 April 2026 8:51 PM IST
Cheepurupalli
X

Cheepurupalli: చీపురుపల్లి పంచాయతీకి అంతర్జాతీయ ఐఎస్‌ఓ (ISO) గుర్తింపు

Cheepurupalli: చీపురుపల్లి మండలం చీపురుపల్లి మేజర్ గ్రామపంచాయతీని కేరళ స్థానిక పరిపాలన సంస్థ బృందం ఈరోజు సందర్శించింది. పంచాయతీ పరిపాలనలో పెన్షన్ పంపిణీ, కార్యాలయ పనితీరు, ప్రజలకు అందిస్తున్న సేవలపై క్షుణ్ణంగా తనిఖీ చేశారు.

గ్రామపంచాయతీలో పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీరు సరఫరా, వీధిలైట్ల నిర్వహణ సమర్థవంతంగా జరుపుతున్నారని అత్యంత సంతృప్తి వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లాలోనే అత్యుత్తమ గ్రీనరీ, ఆహ్లాదకర వాతావరణంలో ఉన్న గ్రామ పంచాయతీగా చీపురుపల్లిని గుర్తించి ISO-9001-2015 ధ్రువీకరణ పత్రమును ప్రదానం చేశారు.

కేరళ రాష్ట్ర స్థానిక పరిపాలన వ్యవహారాల సంస్థ డిప్యూటీ డైరెక్టర్ శ్రీ సుకుమారున్ , రాష్ట్ర పంచాయతీ కార్యాలయం అధికారి శ్రీ ఇమామ్ ఆధ్వర్యంలో చీపురుపల్లి మేజర్ పంచాయతీ ప్రత్యేక అధికారి శ్రీ ఐ. సురేష్ ధ్రువీకరణ పత్రము అందజేశారు.

ఈ కార్యక్రమంలో చీపురుపల్లి కార్యదర్శి శ్రీమతి వై. ఝాన్సీ రాణి, జూనియర్ సహాయకులు శ్రీ ఎన్. రామ్మోహన్రావు, శ్రీ ఎస్. ఈశ్వరరావు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

G SIMHACHALAM,	CHIPURPALLY

G SIMHACHALAM, CHIPURPALLY

Next Story