Cheepurupalli: ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించిన కిమిడి రామ్ మల్లిక్ నాయుడు

Cheepurupalli: చీపురుపల్లి ప్రభుత్వాసుపత్రిలో సేవా సంకల్ప అభియాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని టీడీపీ నేత కిమిడి రామ్ మల్లిక్ ప్రారంభించారు.

G SIMHACHALAM,	CHIPURPALLY
Published on: 29 Sept 2026 3:28 PM IST
Cheepurupalli
X

Cheepurupalli: ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించిన కిమిడి రామ్ మల్లిక్ నాయుడు

చీపురుపల్లి: చీపురుపల్లి ప్రభుత్వాసుపత్రి ప్రాంగణంలో సేవా సంకల్ప అభియాన్ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ మెగా వైద్య శిబిరాన్ని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీ కిమిడి రామ్ మల్లిక్ నాయుడు గారు ప్రారంభించారు.

ఈ శిబిరంలో ప్రజలకు గుండె సంబంధిత వ్యాధులు, స్త్రీల ఆరోగ్యం, జనరల్ మెడిసిన్, మాతా-శిశు ఆరోగ్యం, ఎముకల సంబంధిత సమస్యలకు సంబంధించి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి రక్త పరీక్షలు చేసి, వైద్యుల సూచన మేరకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు.

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ఈ శిబిరాన్ని నిర్వహించినట్లు ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ కుమార్ గారు తెలిపారు. ప్రజలు ఆరోగ్యంపై అవగాహన కలిగి ఉండాలని వైద్యులు సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, నర్సులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

G SIMHACHALAM,	CHIPURPALLY

G SIMHACHALAM, CHIPURPALLY