Cheepurupalli: డ్రగ్స్‌ను తరిమేద్దాం - భవిష్యత్తును మలుచుకుందాం!

Cheepurupalli: చీపురుపల్లి పోలీసులు 'సంకల్పం 2.0' లో భాగంగా పెద్ద నడిపల్లిలో డ్రగ్స్ వ్యతిరేక ర్యాలీ నిర్వహించారు.

G SIMHACHALAM,	CHIPURPALLY
Published on: 20 April 2026 9:06 PM IST
Cheepurupalli
X

Cheepurupalli: డ్రగ్స్‌ను తరిమేద్దాం - భవిష్యత్తును మలుచుకుందాం!

Cheepurupalli: యువత భవితకు డ్రగ్స్ అనే చీకటి అలుముకోకుండా “సంకల్పం 2.0” పేరుతో చీపురుపల్లి పోలీసులు ముందడుగు వేశారు. చీపురుపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ జి. శంకర్రావు ఆధ్వర్యంలో, సబ్ ఇన్స్పెక్టర్ శ్రీ ఎల్. దామోదర్ కలిసి పెద్ద నడిపల్లి గ్రామంలో డ్రగ్స్ వ్యతిరేక మహోద్యమాన్ని చేపట్టారు.

గ్రామ పెద్దల సహకారంతో యువతతో కలిసి "డ్రగ్స్ వద్దు - జీవితం ముద్దు", "డ్రగ్స్‌ను తరిమేద్దాం - భవిష్యత్తును మలుచుకుందాం" అనే నినాదాలతో గ్రామ వీధుల్లో భారీ చైతన్య ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం నిర్వహించిన అవగాహన సదస్సులో డ్రగ్స్ వినియోగం వల్ల కుటుంబాలు ఎలా ఛిన్నాభిన్నం అవుతున్నాయో, భవిష్యత్తు ఎలా నాశనమవుతుందో వివరించారు.

ఈ సందర్భంగా సీఐ శ్రీ జి. శంకర్రావు మాట్లాడుతూ..

“ఒక్క క్షణం ఆనందం కోసం జీవితాన్ని పణంగా పెట్టవద్దు. మాదకద్రవ్యాలకు బానిసైతే మీ కలలు కళ్లు తెరిచేలోపే కాలిపోతాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి ప్రపంచ దిగ్గజ కంపెనీలను నడిపిస్తున్నది మన భారతీయ యువతే. మీరు కూడా అలాంటి స్థాయికి ఎదగాలి. మీ తల్లిదండ్రుల కలలను నిజం చేయాలి. డ్రగ్స్‌కు నో చెప్పండి - జీవితానికి యెస్ చెప్పండి” అని పిలుపునిచ్చారు.

యువత తమ లక్ష్యాలను నిర్దేశించుకుని, క్రమశిక్షణతో ముందుకు సాగాలని, ఏదైనా సమస్య వస్తే పోలీసులను సంప్రదించాలని ఎస్ఐ దామోదర్ సూచించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ హెడ్మాస్టర్ శ్రీ సి.హెచ్. పరసై, గ్రామ పెద్దలు శ్రీ సూరప్పలనాయుడు, శ్రీ ప్రకాష్ రావు, శ్రీ ఆదినారాయణ, పెద్ద ఎత్తున యువకులు, పెద్దలు, మహిళలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

G SIMHACHALAM,	CHIPURPALLY

G SIMHACHALAM, CHIPURPALLY

Next Story