Cheepurupalli: చీపురుపల్లిలో తీరిన దశాబ్దాల తాగునీటి కష్టాలు
Cheepurupalli: విజయనగరం జిల్లా చీపురుపల్లి రామాంజనేయ కాలనీలో దశాబ్దాల తాగునీటి కష్టాలు తీరాయి.
Cheepurupalli: చీపురుపల్లిలో తీరిన దశాబ్దాల తాగునీటి కష్టాలు
Cheepurupalli: చీపురుపల్లి పట్టణ పరిధిలోని రామాంజనేయ కాలనీ రోడ్డులో నటరాజ్ థియేటర్, స్మశానవాటిక ప్రక్కన నివసిస్తున్న ప్రజల దశాబ్దాల తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. కాలనీవాసుల మంచినీటి సదుపాయం కొరకు ₹9 లక్షల పంచాయతీ నిధులతో నిర్మించనున్న నూతన బోరు బావుల ఏర్పాటుకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నిర్వాహక కార్యదర్శి, యువనేత శ్రీ కిమిడి రామ్ మాలిక్ నాయుడు గారు ఆదివారం ఘనంగా శంకుస్థాపన చేశారు.
అనంతరం బోరింగ్ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ "ప్రజల కనీస అవసరాలను తీర్చడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది. నీటి ఎద్దడి వల్ల స్థానికులు, ముఖ్యంగా మహిళలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అత్యంత వేగంగా నిధులు మంజూరు చేయించి ఈ పనులకు శ్రీకారం చుట్టాం. రాబోయే రోజుల్లో నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలోనూ, వార్డులోనూ మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తాం" అని అన్నారు.
తమ కాలనీ తాగునీటి కష్టాలను గుర్తించి, తక్షణమే స్పందించి బోర్ల ఏర్పాటుకు చొరవ చూపిన యువనేత రామ్ మాలిక్ నాయుడు గారికి కాలనీ ప్రజలు, మహిళలు ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, పంచాయతీ అధికారులు మరియు రామాంజనేయ కాలనీ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




