Cheepurupalli: స్వచ్ఛతా హి సేవా 2026 కార్మికులను సన్మానించిన ఎమ్మెల్యే

Cheepurupalli: చీపురుపల్లిలో ఘనంగా స్వచ్ఛతా హి సేవా 2026 కార్యక్రమం. పారిశుద్ధ్య కార్మికులను సన్మానించి, కిట్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు.

G SIMHACHALAM,	CHIPURPALLY
Published on: 18 Sept 2026 11:47 PM IST
Cheepurupalli
X

Cheepurupalli: స్వచ్ఛతా హి సేవా 2026 కార్మికులను సన్మానించిన ఎమ్మెల్యే

చీపురుపల్లి: చీపురుపల్లిలో స్వచ్ఛతా హి సేవా 2026 కార్యక్రమం. ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు, రామ్ మల్లిక్ నాయుడు పంచాయతీ కార్మికులకు జీతాలు, కిట్లు పంపిణీ చేసి సన్మానించారు. చీపురుపల్లిలో స్వచ్ఛతా హి సేవా కార్యక్రమం.. పారిశుద్ధ్య కార్మికులకు ఎమ్మెల్యే కళా వెంకట్రావు సన్మానం.

చీపురుపల్లి: స్వచ్ఛ భారత్ మిషన్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు నిర్వహిస్తున్న 'స్వచ్ఛతా హి సేవా 2026' కార్యక్రమాల్లో భాగంగా చీపురుపల్లి పంచాయతీ కార్యాలయంలో గురువారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చీపురుపల్లి ఎమ్మెల్యే శ్రీ కిమిడి కళా వెంకట్రావు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీ కిమిడి రామ్ మల్లిక్ నాయుడు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కళా వెంకట్రావు పంచాయతీ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులకు నెల జీతాలు అందజేసి, ఘనంగా సన్మానించారు. అనంతరం వారికి అవసరమైన స్వచ్ఛత కిట్లను పంపిణీ చేశారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ "గ్రామాలు పరిశుభ్రంగా, ప్రజలు ఆరోగ్యంగా ఉండటంలో పంచాయతీ కార్మికుల పాత్ర మరువలేనిది. వారి సేవలు అభినందనీయం" అని అన్నారు.

టీడీపీ నేత రామ్ మల్లిక్ నాయుడు మాట్లాడుతూ "ఎండ, వాన అనే తేడా లేకుండా సేవ చేస్తున్న కార్మికులను గౌరవించడం మనందరి బాధ్యత. స్వచ్ఛతా హి సేవా ద్వారా పరిశుభ్రతపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి" అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పంచాయతీ సిబ్బంది, టీడీపీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

G SIMHACHALAM,	CHIPURPALLY

G SIMHACHALAM, CHIPURPALLY