Seethanagaram: సీతానగరంలో దుకాణాలు ఇటుక బట్టీల్లో బాలకార్మికుల తనిఖీలు
Seethanagaram: బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనే లక్ష్యంగా జూన్ నెలంతా ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సహాయ కార్మిక కమిషనర్ సువర్ణ తెలిపారు.
Seethanagaram: సీతానగరంలో దుకాణాలు ఇటుక బట్టీల్లో బాలకార్మికుల తనిఖీలు
సీతానగరం: పార్వతీపురం మన్యం జిల్లాలో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనే లక్ష్యంగా జూన్ నెల పొడవునా ప్రత్యేక డ్రైవ్, అవగాహన కార్యక్రమాలు, తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సహాయ కార్మిక కమిషనర్ సువర్ణ తెలిపారు. కార్మిక శాఖ కమిషనర్ మరియు జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆమె వెల్లడించారు.
ఈ నేపథ్యంలో గురువారం సీతానగరం మండలంలోని వివిధ వ్యాపార సంస్థలు, దుకాణాలు, ఇటుక బట్టీలలో కార్మిక శాఖ ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. బాలకార్మికులను గుర్తించి వారిని పనుల నుంచి విముక్తి కల్పించడమే కాకుండా, యజమానులకు బాలకార్మికులను నియమించడం వల్ల కలిగే చట్టపరమైన పరిణామాలపై అవగాహన కల్పించారు.
అనంతరం మండల కేంద్రంలో బాలకార్మిక నిర్మూలనపై అవగాహన ర్యాలీ నిర్వహించి, ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేశారు. ప్రతి చిన్నారికి విద్య హక్కు కల్పించడం, బాల్యాన్ని పరిరక్షించడం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని సూచించారు. పిల్లలను పనిలో నియమించడం చట్టవిరుద్ధమని, అలాంటి వారిపై బాల కార్మిక చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సహాయ కార్మిక కమిషనర్ సువర్ణ హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ అధికారి గణేష్, పోలీసు శాఖ, సంక్షేమ శాఖ, నాయ్య శాఖ, విద్యా శాఖ, ఐసీడీఎస్, చైల్డ్ ప్రొటెక్షన్ విభాగం, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, వివిధ లైన్ శాఖల అధికారులు, సిబ్బంది ఉన్నారు.




