Manyam: చినగీసాడ పంచాయితీలో 'బయో పంచాయతీ' తీర్మానం

Manyam: పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం చినగీసాడ పంచాయతీని వంద శాతం సంపూర్ణ ప్రకృతి వ్యవసాయ పంచాయతీగా తీర్చిదిద్దేందుకు ఏడు గ్రామాల కమిటీలతో కీలక తీర్మానం చేశారు.

V.SESHU	, KURUPAM
Published on: 17 May 2026 8:16 AM IST
Manyam
X

Manyam: చినగీసాడ పంచాయితీలో 'బయో పంచాయతీ' తీర్మానం

Manyam: గుమ్మ లక్ష్మీపురం మండలంలోని చిన్నగీసాడ పంచాయతీ పరిధిలోని నోండ్రుకోన గ్రామంలో పంచాయతీ పరిధిలోని ఏడు గ్రామాల బయో గ్రామ కమిటీలతో ఈరోజు బయో పంచాయతీ తీర్మానం చేసే క్రమంలో రైతు సాధికార సంస్థ కన్సల్టెంట్స్, సచివాలయ సిబ్బంది, వైద్య శాఖ సిబ్బంది, ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఉత్తమ రైతులు, మహిళా సంఘ ప్రతినిధులు, అంగన్వాడి సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, మహిళా సభ్యులతో సమావేశంలో నిర్వహించబడింది.

ఈ సందర్భంగా బయో గ్రామ కమిటీ సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితులలో గిరిజన ప్రాంతాల్లో పల్లం, మెట్టు, పొడు భూములలో పంటలు ఏ విధంగా పండిస్తున్నారు? ఏ ఏ పంటలు పండిస్తున్నారు? వాటి దిగుబడులు ఎలా ఉన్నాయి? వ్యవసాయం లో నాడు - నేడు పరిస్థితులతో పాటు దిగుబడి పెరగడానికి చేపడుతున్న చర్యలు చర్చించడంతోపాటు మారుతున్న పరిస్థితులకు అనుకూలంగా చేపట్టాల్సిన ప్రకృతి వ్యవసాయ విధానాల గూర్చి చర్చించడం జరిగింది.

బయో గ్రామ కమిటీలు వారు ఆచరించడంతో పాటు తోటి రైతులకు అందుబాటులో ఉండి తగు సూచనలు సలహాలు ఇచ్చి ఏ విధమైన రసాయన ఎరువులు పురుగు మందులు వాడకుండా సహజంగా లభించే వనరులను ఉపయోగించుకొని పిఎండిఎస్ (నవధాన్యాలు) జీవామృతాలు, నిరంతర పంటల సాగు చేయడం ద్వారా భూమిలో సారం నింపడం ద్వారా పంటలు దిగుబడి పెంచగలమని తెలిపారు.

చినగీసాడ పంచాయతీ పరిధిలో అన్ని గ్రామాలను బయో గ్రామాలుగా తీర్చిదిద్దడంతో పాటు మొత్తం పంచాయితీనే సంపూర్ణ ప్రకృతి వ్యవసాయ పంచాయితీ గా రూపుదిద్దడానికి రైతు సాధికార సంస్థ కృతనిశ్చయంతో ఉందని, అందుకోసమే 5 మంది సభ్యులతో కూడిన కన్సల్టెంట్ ల బృందం పని చేయడం జరుగుతుందని తెలిపారు.

ప్రకృతి వ్యవసాయ విధానంలో పంటలు పండించి మనుషుల, సకల జీవుల ఆరోగ్యంతో పాటు నేల, నీరు, వాతావరణం ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవలసిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. పంటలు బాగా పండి దిగుబడులు పెరగాలంటే భూమిలో సారం నిలపడం, వృద్ధి చేసుకోవడం మాత్రమే మార్గమని భూమిని సారం చేసుకోవడానికి ఒక ఎకరాకు 30 రకాల పంటల విత్తనాల మిశ్రమం,

15 కేజీలు వేసుకోవడం వలన ప్రయోజనం ఉంటుందని, ప్రతి రైతు తప్పనిసరిగా ఈ పద్ధతులు పాటించడం వలన తక్కువ ఖర్చుతో అధిక ప్రయోజనం పొంది, అధిక దిగుబడులు సాధించడానికి అవకాశం కలుగుతుంది అన్నారు.ఈ సందర్భంగా PMDS సీడ్ కిట్లను రైతులకు అందించారు. బయో పంచాయతీ గా రూపుదిద్దుకోడానికి తీర్మానం చేయడంతో పాటు అందరితో ప్రమాణం చేయించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో రైతు సాధికార సంస్థ కల్చరల్ కన్సల్టెంట్ శ్రీ రౌతు వాసు దేవరావు, సిలబస్ కన్సల్టెంట్ శ్రీ తుంబలి శివాజీ, బయో విలేజెస్ కన్సల్టెంట్ శ్రీమతి ఉమా మహేశ్వరి, మార్కెటింగ్ కన్సల్టెంట్ శ్రీమతి విరాజిత, సహాయ కల్చరల్ కన్సల్టెంట్ శ్రీ వి. సన్యాసి రావు, ఎంపీటీసీ శ్రీమతి పువ్వుల జ్యోతి, గ్రామ వ్యవసాయ సహాయకులు దినేష్ కుమార్, మాజీ సర్పంచ్ లు నిమ్మక శాంతి, కిల్లక మిన్నారావు, గ్రామ పెద్ద మండింగి. గుంపస్వామి, జట్టు ట్రస్టు సిబ్బంది గౌరీ శంకర్, మురళి మోహన్, గోవింద రావు, సునీల్ కుమార్, APCNF కార్యకర్తలు పువ్వుల దివాకర్, అప్పలమ్మ, రైతులు, జట్టు నేస్తాలు పాల్గొన్నారు.

V.SESHU	, KURUPAM

V.SESHU , KURUPAM

Next Story