Bobbili: బెర్రీ కంపెనీ అక్రమాలపై HRCకి ఫిర్యాదు చేస్తాం సీఐటీయూ!
Bobbili: బొబ్బిలి గ్రోత్ సెంటర్ బెర్రీ కంపెనీలో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంతో కార్మికులు మృతి చెందుతున్నారు. యాజమాన్యంపై కేసు నమోదు చేయాలని సిఐటియు తీవ్ర ఆగ్రహం.
Bobbili: బెర్రీ కంపెనీ అక్రమాలపై HRCకి ఫిర్యాదు చేస్తాం సీఐటీయూ!
Bobbili: బెర్రీ కంపెనీలో గతవారం ఉత్తరప్రదేశ్ కు చెందిన సరోజ్ పాల్ ఆక్సిజన్ ప్లాంట్లో ఆపరేటర్ గా పనిచేస్తూ ప్రమాదానికి గురై పది రోజులుగా మృత్యుత్తో పోరాడుతూ విశాఖపట్నం ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో చనిపోయారు. నిన్న సోమవారం ముగ్గురికి కాలిపోయి గాయాలయ్యాయి ఆ ముగ్గురు ఎవరు ఎలా ప్రమాదం జరిగింది. ఇంతవరకు బయటికి రాలేదు. బెర్రి కంపెనీలో భద్రతా ప్రమాణాలు పాటించడం లేదు.
ప్రభుత్వం అండతో డబ్బు మదంతో యాజమాన్యం ఈ అన్యాయాలకు పాల్పడుతున్నది. మానవ హక్కుల సంఘానికి బెర్రీ కంపెనీలో జరుగుతున్న అక్రమాలు ప్రభుత్వ నిర్లక్ష్యం వీటన్నిటిపై ఫిర్యాదు చేస్తామని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పి. శంకరరావు, గ్రోత్ సెంటర్ సీఐటీయూ నాయకులు సింగిరెడ్డి గోపాలు అన్నారు. బెర్రీ కంపెనీలో అత్యంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయని అన్నారు.
గతంలో ఈ కంపెనీలోనే చాలామంది ప్రమాదానికి గురై చనిపోయారు. గ్రోత్ సెంటర్లో ఉన్న ఫెర్రోఎలాయిస్ కంపెనీలు అన్నీ ఒకటై స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వకుండా బయట రాష్ట్రాల వారికి ఉద్యోగాలు ఇస్తున్నారు. వాళ్లతో రోజుకు 12 గంటలు పని చేయించుకోవడం ప్రమాదవశాత్తు చనిపోతే చనిపోయిన కుటుంబాలకు అరకొర చెల్లించి అత్యంత దారుణంగా వాళ్ళ శవాల్ని వాళ్లకు అప్పజెప్తున్నారు. లోపల చస్తే అడిగేవాడు లేడు ఇవన్నీ కాపాడ్డానికి కొందరికి లక్షల రూపాయలు ముట్ట చెబుతున్నారు. బెర్రీ కంపెనీలో జరుగుతున్న హత్యలపై ప్రజాప్రయోజనం వ్యాజ్యం కింద కేసు వేస్తామని తెలియజేశారు.




