Parvathipuram: మధ్యాహ్న భోజనం ఇస్కాన్‌కు ఇస్తారా?.. కూటమి సర్కార్‌పై సిఐటియు వార్!
Parvathipuram: మధ్యాహ్న భోజన పథకాన్ని ఇస్కాన్ సంస్థకు అప్పగించవద్దని పార్వతీపురంలో సిఐటియు డిమాండ్.
Parvathipuram: మధ్యాహ్న భోజనం ఇస్కాన్‌కు ఇస్తారా?.. కూటమి సర్కార్‌పై సిఐటియు వార్!
పార్వతీపురం: ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల్లో నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని ఇస్కాన్ సంస్థకు అప్పగించేందుకు ప్రయత్నాలు ప్రారంభించిందని అందులో భాగంగానే స్మార్ట్ కిచెన్ల పేరుతో కొన్ని కేంద్రాలను గుర్తించి నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తున్నదని ఈ ప్రయత్నాలను మధ్యాహ్న భోజన నిర్వహకుల సంఘం, సిఐటియు ఎట్టి పరిస్థితులలోనూ అంగీకరించవని సిఐటియు జిల్లా కార్యదర్శి బి వి రమణ, జిల్లా కోశాధికారి గొర్లి వెంకటరమణ హెచ్చరించారు. పార్వతీపురం జిల్లా కేంద్రంలో శుక్రవారం మధ్యాహ్న భోజన నిర్వహకుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2018లో చంద్రబాబు నాయుడు ఇలానే మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేటీకరించేందుకు ప్రయత్నాలు చేశారని అప్పుడు సిఐటియు రాష్ట్రవ్యాప్త ఆందోళన నిర్వహించి ఆ ప్రయత్నాన్ని తిట్టుకొట్టిందని మరలా కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత అలాంటి ప్రయత్నాలనే చేస్తున్నదని విమర్శించారు.
కొంతమంది ప్రభుత్వ పెద్దలకు కమిషన్లను అందజేసేందుకు చేస్తున్న ప్రయత్నమే తప్ప ఈ నూతన స్మార్ట్ కిచెన్ల విధానం ఎట్టి పరిస్థితుల్లోను గిరిజన ప్రాంతానికి ఉపయోగపడదని, మధ్యాహ్న భోజన పథకంలో ఈ మార్పు వలన గిరిజన విద్యార్థలకు మధ్యాహ్న భోజనం అందక పాఠశాలలలో డ్రాప్ అవుట్స్ పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ నూతన విధానం వలన మధ్యాహ్నం భోజన నిర్వాహకులకే కాకుండా విద్యార్థులకు, దళిత గిరిజన ప్రజలకు తీవ్ర నష్టం కలుగుతుందని, ఈ ప్రయత్నాలను తక్షణమే సంహరించుకోవాలని డిమాండ్ చేశారు ,లేని యెడల మధ్యాహ్న భోజన నిర్వహకులు, పాఠశాలల విద్యార్థినీ విద్యార్థులు,తల్లిదండ్రులతో సిఐటియు ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.




