Vizianagaram: కారుణ్య నియామకం చేపట్టాలని కోరితే నిర్లక్ష్యపు సమాధానమా?
Vizianagaram: బొబ్బిలి మున్సిపల్ కమిషనర్ పారిశుద్ధ్య కార్మికుల పట్ల దురుసుగా వ్యవహరిస్తున్నారని సీఐటీయూ నేతలు మండిపడ్డారు.
Vizianagaram: కారుణ్య నియామకం చేపట్టాలని కోరితే నిర్లక్ష్యపు సమాధానమా?
విజయనగరం: సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పి. శంకర్రావు జిల్లా కమిటీ సభ్యుడు బంగారి యుగంధర్ మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులు ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలకు వ్యాధులు రాకుండా రక్షణగా నిలుస్తున్నారు. సూర్యుడు ఉదయించక ముందే పారిశుద్ధ్య కార్మికులు ఇంటింటికి చెత్త సేకరణ, కాలువలు శుభ్రం చేసి రోడ్లను శుభ్రం చేస్తూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్నారు పారిశుధ్య కార్మికులు ఈరోజు ఉదయం తన తోటి కార్మికుడు జలగడుగుల శ్యామల కుమార్ 18 నెలల క్రితం చనిపోయారు.
అతను భార్య పిల్లలు రోడ్డును పడ్డారు గతంలో చనిపోయిన కార్మికులకు కారుణ్య నియమకం క్రింద ఉద్యోగాలు ఇచ్చారు. కమిషనర్ గారు ఆ కుటుంబాన్ని ఆదుకోండి అని వినతిపత్రం ఇవ్వడానికి వెళితే మీరు గేటు బయట రోడ్డు మీద ధర్నా చేయాలి ముందుగా నా అనుమతి తీసుకోవాలి ఆ తరువాతే ధర్నా చేయాలి. ఆ ఇచ్చారుగా వెళ్ళండి అని రేషగా సమాధానం చెప్పారు. కమిషనర్ గారికి తక్కువ కులం వాళ్లంటే చాలా చిన్న చూపుగా కనిపిస్తున్నది.
ఎన్నిసార్లు ఈ సమస్యపై వెళ్లిన చాలా రేష్ గా సమాధానం చెబుతున్నారు. గత కమిషనర్లు మరణించిన వారి బిడ్డలకు ఉద్యోగాలు చాలామంది కి ఇచ్చారు. ఈ కమిషనర్ గారు మున్సిపల్ ఆఫీస్ కి పారిశుద్ధ్య కార్మికులు వస్తే చాలా చిన్న చూపు చూస్తున్నారు. కమిషనర్ గారిపై చర్యలు తీసుకోవాలని స్పెషల్ ఆఫీసర్ బొబ్బిలి ఆర్డిఓ గారికి స్థానిక ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తున్నాము రేపటినుండి మా సమస్యలు పరిష్కరించాలని పని బందు చేస్తున్నాము ప్రజలందరూ మా పోరాటానికి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు జి. గౌరేష్ జి. వాసు జి. పోలరాజు బి. వెంకటరమణ బి. చంద్ర కార్మికులు పాల్గొన్నారు.




